తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలపై (Telangana Govt Schools) విశ్వాసం పెరుగుతోంది. తాజాగా వచ్చిన గణాంకాల ప్రకారం, 2024–25 విద్యా సంవత్సరానికి ఇప్పటి వరకు 3.68 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ తీసుకున్నారు. ఇది గత ఏడాది ఇదే సమయంలో నమోదైన 2.9 లక్షలతో పోలిస్తే గణనీయంగా అధికం.
అధికంగా చేరినవి ప్రాథమిక తరగతులు
ఈ విద్యార్థులలో అత్యధికంగా ఒకటో తరగతిలో 1,38,153 మంది చేరగా, రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు 2,29,919 మంది చేరారు. విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లోని అభివృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధన వంటివి ఈ వృద్ధికి కారణాలుగా పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లాలో అగ్రస్థానం
జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి జిల్లా 36,325 విద్యార్థులతో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో హైదరాబాదుతో సరిహద్దు మండలాలు, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా చేరికలు నమోదయ్యాయి. అధికారుల ప్రకారం, అగస్టు నెలాఖరు వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల ప్రజల మద్దతు పెరుగుతుందన్న సంకేతంగా భావిస్తున్నారు.
Read Also : Airtel : డేటా అవసరం లేని వారికోసం ఎయిర్టెల్ కొత్త ప్లాన్