ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విధానం(ap liquor case)లో చోటుచేసుకున్న భారీ అవినీతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తన దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలో, మాజీ రాజ్యసభ సభ్యుడు మరియు వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత వి. విజయసాయి రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ చేసింది. జూలై 12 ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆయనను సిట్ ఆదేశించింది. ఏప్రిల్‌లో విజయసాయి రెడ్డి సిట్ ఎదుట హాజరైన సంగతి తెలిసిందే.
పాలసీ మార్పుల ద్వారా ముడుపులు – ఆరోపణల మయం
గత వైఎస్సార్‌సీపీ (YCP) ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీలో తేడాలు చేసారని, కొన్ని ప్రముఖ మద్యం బ్రాండ్‌లకు అనుకూలంగా మార్పులు జరిగాయని, ఇందుకోసం భారీగా ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అవినీతికి సంబంధించి పలు కీలక వ్యక్తుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఇటీవల పురుషోత్తం వరుణ్ కుమార్ అనే వ్యక్తిని సిట్ 40వ నిందితుడిగా చేర్చింది. వరుణ్ కుమార్ ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించాడని విచారణలో వెల్లడి కావడంతో, అధికారులు ఆయన కోసం లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.
ED కూడా రంగంలోకి – మనీలాండరింగ్ కోణం విచారణలోకి
ఈ కేసుకు సంబంధించి అవకతవకల్ని ఆర్థిక కోణంలోనూ పరిశీలించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. PMLA చట్టం కింద కేసు నమోదు చేసి, హవాలా లావాదేవీలు, అక్రమ నగదు బదిలీలపై దృష్టి సారించింది. మద్యం విధాన మార్పుల పేరుతో పెద్ద ఎత్తున జరిగిన ఆర్థిక లావాదేవీల్లో ఎంతమంది ప్రమేయం ఉందో తెలుసుకునేందుకు విచారణ మరింత లోతుగా సాగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయ నేతలకు నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉన్నదని వర్గాలు భావిస్తున్నాయి.
Read Also : Telangana Map Controversy: లోకేష్‌కు బీజేపీ నేత ఇచ్చిన చిత్రపటంలో తెలంగాణ లేకపోవడంపై బీఆర్ఎస్ ఫైర్