చారిత్రక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్టు (Third Test) లో నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) అద్భుతంగా రాణించాడు. ఈ యువ ఆల్‌రౌండర్ తన బౌలింగ్‌తో ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను గడగడలాడించాడు. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు పడగొట్టి టీమిండియాకు మొదటి సెషన్ నుంచే ఆధిక్యం కల్పించాడు.టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ నిదానంగా ఆడుతూ 43 పరుగులు జోడించారు. కానీ, ఈ భాగస్వామ్యాన్ని నితీశ్ కేవలం ఒక ఓవర్‌లో చీల్చి వేసాడు.

ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు
ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన నితీశ్… తొలి షాక్ డకెట్‌కి ఇచ్చాడు. అతను 23 పరుగుల వద్ద రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో చివరి బంతికి క్రాలీ (18)ను కూడా అవుట్ చేశాడు. వికెట్ల వెనుక పంత్ మరో క్యాచ్ పట్టి భారత్‌ను మరింత బలంగా నిలబెట్టాడు.
లంచ్‌కు ముందు ఇంగ్లండ్ కష్టాల్లో
ఈ డబుల్ షాక్‌తో ఇంగ్లండ్ 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. లంచ్ సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్ (24), ఓలీ పోప్ (16) నిదానంగా ఆడుతున్నారు.
నితీశ్ స్పెల్‌లో ఫలితాల మజా
నితీశ్ కుమార్ రెడ్డి 5 ఓవర్లు వేసి కేవలం 15 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీసాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ వికెట్ల కోసం శ్రమిస్తూనే ఉన్నారు. కానీ, తొలి సెషన్‌లో నితీశ్ ప్రదర్శన భారత్‌కి ఊపు తీసుకొచ్చింది.నితీశ్ రెడ్డి లార్డ్స్ వేదికపై చేసిన విజృంభణ అభిమానుల్లో విశేష ఉత్సాహం కలిగించింది. తెలుగు క్రికెట్ అభిమానులకైతే గర్వించదగిన విజయం ఇది.
Read Also : Azharuddin : జగన్మోహన్ రావు అరెస్టుపై స్పందించిన అజారుద్దీన్