బనానా కబాబ్ (Banana Kebab)అనేది స్వీటు మరియు స్నాక్‌లుగా మంచి ఆదరణ పొందిన ఒక ప్రత్యేకమైన వంటకం. పండ్లు ముఖ్యంగా అరటిపండు (బనానా) ఉపయోగించి తక్కువ సమయంతో సులభంగా తయారుచేసుకునే ఈ (Banana Kebab) కబాబ్ అందరినీ ఆకర్షిస్తుంది. అరటిపండు తీపి, మృదువైన త్రుఫ్తికరమైన కబాబ్ (Banana Kebab) స్నాక్స్‌గా లేదా డెజర్ట్ (Dessert)గా తీసుకోవచ్చు.
కావాల్సిన పదార్దాలు
అరటికాయ: ఒకటి, శనగపప్పు: అరకప్పు, చాట్ మసాలా: చిటికెడు, ఆమ్‌చూర్: చిటికెడు, కొత్తిమీర: కొద్దిగా, ధనియాల పొడి: అర టీస్పూన్, జీలకర్ర పొడి: అర టీస్పూన్, గరం మసాలా: పావు టీస్పూన్, కారం: పావు టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా, ఉప్పు: తగినంత

తయారీ విధానం
ముందుగా, అరటికాయను ఉడికించి తొక్క తీసి, ఒక గిన్నెలో వేసి చేత్తో మెదిపి ఉంచాలి. ఉడికించిన శనగపప్పును కూడా మెత్తగా మెదిపి అందులో వేయాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, చాట్ మసాలా, ఆమ్‌చూర్, గరం మసాలా, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలు చేసుకుని.. పొడవుగా కానీ, వెడల్పుగా కానీ వత్తుకుని వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుంటే అరటికాయ కబాబ్ రెడీ. వీటిని టమాటా సాస్, పుదీనా చట్నీతో సర్వ్ చేసుకోవాలి.
భారతదేశంలో ఏ కబాబ్ ప్రసిద్ధి చెందింది?
ఇక్కడ కొన్ని ప్రసిద్ధ కబాబ్ రకాలు ఉన్నాయి: సీఖ్ కబాబ్: ముక్కలు చేసిన మాంసం (సాధారణంగా గొర్రె లేదా కోడి) సుగంధ ద్రవ్యాలతో కలిపి, స్కేవర్‌లపై ఆకారంలో ఉంచి, గ్రిల్ చేస్తారు. గలోటి కబాబ్: లక్నో నుండి ఉద్భవించిన మెత్తగా ముక్కలు చేసిన మాంసం మరియు సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేసిన నోటిలో కరిగిపోయే కబాబ్‌లు.
భారతదేశంలో కబాబ్‌ను ఎవరు కనుగొన్నారు?
కబాబ్‌లు ఆఫ్ఘన్ ఆక్రమణదారులతో కలిసి భారతదేశానికి వచ్చాయి, వారు దానిని టర్క్‌ల నుండి తీసుకున్నారు – అక్కడ అది ఉద్భవించింది. టర్కిష్ వంటగదిలో ఉద్భవించి, ఆఫ్ఘన్లు భారతదేశానికి తీసుకువచ్చారు. తరువాత మొఘలులు ప్రాచుర్యం పొందాయి , కబాబ్ ఇప్పటివరకు అత్యంత బహుముఖ వంటకాల్లో ఒకటి.
Read hindi news: hindi.vaartha.com
Read Also:Instant coffee: ఇన్‌స్టంట్ కాఫీలతో కళ్లకు ప్రమాదం..జాగ్రత్త