కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ప్రజా జీవితానికి విరామం అనంతరం తన జీవితంలో చేసే కృషిని వివరిస్తూ, వేదాలు, ఉపనిషత్తులు చదవడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి వ్యక్తిగత అభిప్రాయంగా కాకుండా, దేశవ్యాప్తంగా రైతులకు సూచనాత్మక మార్గంగా మారే అవకాశం ఉంది.గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు తెలిపారు. రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలను ఆయన వివరించారు. సహకార శాఖ మంత్రిగా తన అనుభవం గురించి కూడా ఆయన మాట్లాడారు.రిటైర్మెంట్ తర్వాత తన సమయాన్ని వేదాలు, ఉపనిషత్తులు చదవడానికి, ప్రకృతి వ్యవసాయానికి కేటాయిస్తానని అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు.
అనేక ప్రయోజనాలు
రసాయన ఎరువులతో పండించిన పంటల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయన అన్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా వ్యవసాయ ఉత్పాదకతను కూడా పెంచుతుందని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు.రిటైర్మెంట్ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు, ప్రకృతి వ్యవసాయానికే సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నా. రసాయన ఎరువులతో పండించే పంటలతో బీపీ, థైరాయిడ్ (Thyroid) తో పాటు కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు, వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

సహకార శాఖ మంత్రి
శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది’’ అని అమిత్ షా అన్నారు.సహకార శాఖ మంత్రిగా తన ప్రయాణం చాలా గొప్పగా ఉందని అమిత్ షా చెప్పారు. హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు అది చాలా ముఖ్యమైన శాఖ అని అందరూ అన్నారని ఆయన గుర్తు చేశారు. కానీ, సహకార శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించినప్పుడు మాత్రం హోం శాఖ (Home Department) కంటే పెద్ద శాఖ ఇచ్చారని తాను భావించానని షా అన్నారు. ఎందుకంటే ఈ శాఖ దేశంలోని రైతులు, పేదలు, గ్రామాలు, పశుసంపద కోసం పనిచేస్తుందని ఆయన వివరించారు. ప్రస్తుతం అమిత్ షా రిటైర్మెంట్ ప్లాన్ గురించి నెట్టింట వైరల్ అవుతోంది.
అమిత్ షా పూర్తి పేరు ఏమిటి?
అమిత్ అనిల్ చంద్ర షా (Amit Anilchandra Shah)
అమిత్ షా ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?
అమిత్ షా 22 అక్టోబర్ 1964న గుజరాత్లోని ముంబై (అప్పట్లో బొంబాయి) లో జన్మించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Bombay HighCourt: భార్య ప్రవర్ధన సరిగ్గాలేదన్న సాకుతో DNA పరీక్ష చేయలేం: హైకోర్టు