हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

AP Students: ఐఐటి, నీట్లో అర్హత సాధించిన గురుకుల విద్యార్థులకు రూ.1 లక్ష ప్రభుత్వ ప్రోత్సాహకం

Anusha
AP Students: ఐఐటి, నీట్లో అర్హత సాధించిన గురుకుల విద్యార్థులకు రూ.1 లక్ష ప్రభుత్వ ప్రోత్సాహకం

విజయవాడ : ఐఐటీ, నీట్ లో అర్హత సాధించి మెడిసిన్ ఇంజనీరింగ్ లో సీట్లు సాధించిన డా. బి. ఆర్ అంబేద్కర్ గురుకులాల విద్యార్థులకు రూ.1 లక్ష ప్రభుత్వ ప్రోత్సహకం అందించాలని ఎపీఎసీడబ్ల్యుఆర్ఐఎస్ ఆఫ్ గవర్నెన్స్ నిర్ణయించింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి (Dola Sri Bala Veeranjaneyaswamy) అధ్యక్షతన ఎపీఎన్డబ్ల్యుఆర్ఎస్ కార్యాలయంలో 75 వ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఆమోదం తెలిపింది.

వసతి గృహాల

ఐఐటి, నీట్ లో అర్హత సాధించి మెడిసిన్, ఇంజనీరింగ్ లో సీట్లు సాధించిన డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులకు రూ.1 లక్ష ప్రభుత్వ ప్రోత్సాహం ఐఐటి, నీట్ లో అతి తక్కువ మార్కులతో అర్హత సాధించలేకపోయిన 120 మంది విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ రాష్ట్రంలోని 10 ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లలో డిప్యూటేషన్ పై గురుకులాల్లో పనిచేసే ఉత్తమ ఉపాధ్యాయుల నియామకం గురుకులాలు, ఎస్సి సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు 11 రకాల వస్తువులతో కాస్మోటిక్ కిట్స్ ప్రతి గురుకులంలో వీడియో కాన్ఫరెన్స్ (Video conference) ఏర్పాటుకు అవసరమైన చర్యలు గురుకులాల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు వీటితో పాటు గురుకులాల్లో పదవ తరగతి, ఇంటర్ సెకండియర్ లో ఖాళీ సీట్ల అడ్మిషన్లకు బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఆమోదం తెలిపింది.

AP Students: ఐఐటి, నీట్లో అర్హత సాధించిన గురుకుల విద్యార్థులకు రూ.1 లక్ష ప్రభుత్వ ప్రోత్సాహకం
AP Students: ఐఐటి, నీట్లో అర్హత సాధించిన గురుకుల విద్యార్థులకు రూ.1 లక్ష ప్రభుత్వ ప్రోత్సాహకం

తదితరులు పాల్గొన్నారు

ఎపీఎస్ఈబ్ల్యుఆర్ ఐఎస్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశంలో కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా గత విద్యా సంవత్సరంలో అనారోగ్యంతో మృతి చెందిన పల్నాడు జిల్లా వినుకొండ. అంబేద్కర్ గురుకులానికి చెందిన ఆరో తరగతి విద్యార్థిని సంకీర్తన భాయ్ తల్లిదండ్రులకు సాంత్వన పథకం కింద ఆర్థిక సాయంగా రూ.3 లక్షల చెక్కును మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అందజేశారు. ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఎం.ఎం నాయక్, సెక్రటరీ ప్రసన్న వెంకటేష్, సోషల్ వెల్ఫేర్ డైరక్టర్ (Social Welfare Director) లావణ్య వేణి, ఎపీఎస్ డబ్ల్యు ఆర్ఐఎస్ అడిషన్ ల్ సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్, ఎపీఎస్ డబ్ల్యుఆర్ఐఎస్ డిప్యూటీ సెక్రటరీ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఎవరు?

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా 2014, 2019, 2024లో త్రయంగా గెలిచి నియోజకవర్గ ప్రతినిధిగా కొనసాగుతున్నారు.

మంత్రిగా ఏ బాధ్యతలు చేపట్టారు?

12 జూన్ 2024న చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ, వైకల్యాధికారుల వృద్ధాప్య సంక్షేమం, సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల శాఖల పనులను చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Delhi Rao: అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం అర్హుల జాబితా సిద్ధం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870