हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Vivek Venkataswamy:ఈ గొడవలన్ని మాకు సహజమే..

Anusha
Vivek Venkataswamy:ఈ గొడవలన్ని మాకు సహజమే..

తెలంగాణలో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో తనకు విభేదాలు ఉన్నాయి అన్న ప్రచారంపై రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. “ఇలాంటి వదంతులు పూర్తిగా అబద్ధం. జిల్లాకు ఎమ్మెల్యేనే రాజు.ఆ రాజుకు మంత్రులుగా మా సహాయం అవసరమైతే తప్పకుండా చేసి పెడతాం” అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలలో గ్రూపులు, గొడవలు చాలా సాధారణమని, రాష్ట్రంలోని ప్రతి పార్టీలోనూ ఇలాంటివి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో, “బీఆర్ఎస్‌లో కేటీఆర్, కవిత మధ్య గొడవలు లేవా?” అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ (Congress party) లో పాత, కొత్త నేతలందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని వివేక్ తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను మీనాక్షి నటరాజన్ గుర్తిస్తున్నారని, అందరికీ తగిన అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు.

Vivek Venkataswamy:ఈ గొడవలన్ని మాకు సహజమే..
Vivek Venkataswamy:ఈ గొడవలన్ని మాకు సహజమే..

కనీసం అటువైపు

ఇదే సందర్భంగా ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మంత్రులను కలవడానికి కూడా ప్రజలకు అవకాశం ఉండేది కాదని ఆరోపించారు. తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా కాదని, పాశమైలారం ఘటన (Pashamilaram incident) జరిగిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించి ధైర్యం నింపారని గుర్తుచేశారు. గతంలో కొండగట్టులో అంత పెద్ద ప్రమాదం జరిగినా కేసీఆర్ కనీసం అటువైపు వెళ్లలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా మంత్రులను కలుస్తున్నారని అన్నారు. కార్మికులు, గిగ్ వర్కర్ల హక్కుల కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి కనీస వేతనం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు.

వివేక్ వెంకటస్వామి ఎవరు?

వివేక్ వెంకటస్వామి ఒక భారతీయ రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త.
తెలంగాణకు చెందిన ఆయన, ప్రసిద్ధ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కాకా గారి కుమారుడు.

వివేక్ వెంకటస్వామి తండ్రి గురించి?

వివేక్ వెంకటస్వామి తండ్రి, కాకా గారు మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఏడు సార్లు ఎంపీగా, మూడుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు.తండ్రి అడుగుజాడల్లోనే వివేక్ వెంకటస్వామి కూడా రాజకీయాల్లోకి వచ్చారు.ఆయన లోక్‌సభ సభ్యుడిగా (MP) బాధ్యతలు నిర్వహించారు.తెలంగాణ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా కొనసాగుతూ, ప్రజాసేవలో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా పేరొందారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Nizamabad: మద్యానికి బానిసైన తల్లి.. ఐదు నెలల పసికందును హతమార్చిన వైనం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870