స్కూల్ పిల్లలకు బట్టలపై పెన్ ఇంక్ మరకలు (Ink Stain) పడటం సాధారణమే. అయితే బట్టలపై ఈ మరకలు ఓ పట్టాన తొలగిపోవు. చాలా మంది మహిళలకు ఉండే సమస్య ఇది. ముఖ్యంగా బట్టలపై కనిపించే పెన్ ఇంక్ మరకలు (Ink Stain) ఎంత ఉతికినా ప్రయోజనం ఉండదు. వీటిని తొలగించడం ఒక పెద్ద పరీక్షే.
ఇంట్లో గృహిణులు చేసే పనులకు అంతంటూ ఉండదు. నిద్ర లేచింది మొదలు అలుపెరుగక చేస్తూనే ఉంటారు. అయితే వారికి అతిపెద్ద తలనొప్పి పిల్లల బట్టలపై ఉండే మురికి వదిలించడం. బట్టల నుంచి మరకలు ఓ పట్టాన తొలగిపోవు. చాలా మంది మహిళలకు ఉండే సమస్య ఇది. ముఖ్యంగా బట్టలపై కనిపించే పెన్ ఇంక్ మరకలు (Ink Stain) ఎంత ఉతికినా ప్రయోజనం ఉండదు. వీటిని తొలగించడం ఒక పెద్ద టాస్కే. దొరికిన సబ్బులన్నింటినీ ఉపయోగించినా.. ఫలితం ఉండదు.

బట్టలపై ఇంక్‌ను తొలగించడానికి ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే కొన్ని సాధారణ వస్తువులు (Common items) సరిపోతాయి. ముందుగా, పెన్ ఇంక్ తాకిన ప్రదేశంలో హ్యాండ్ శానిటైజర్, డెట్టాల్ లేదా సావ్లాన్ వంటి క్రిమినాశక ద్రవాన్ని కొద్ది మొత్తంలో పూయాలి. ఆ తర్వాత మృదువైన బ్రష్ (టూత్ బ్రష్) సహాయంతో తడిసిన ప్రాంతాన్ని సున్నితంగా రుద్దితే సరి. చిటికెలో మరక మాయం. అయితే బ్రష్‌తో గట్టిగా రుద్దడం చేయకూడదు. అలా చేయడం వల్ల ఫాబ్రిక్ దెబ్బతిని చిరిగిపోతుంది.
ఇది కొన్ని నిమిషాల్లోనే సిరా మరకను తొలగిస్తుంది. తర్వాత ఆ ప్రాంతాన్ని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. బట్లలపై ఎలాంటి పెన్ మరకలనైనా ఇది చిటికెలో తొలగిస్తుంది. హ్యాండ్ శానిటైజర్, డెట్టాల్, సావ్లాన్ ఆల్కహాల్ ఆధారితమైనవి సిరా మరకను కరిగించి ఫాబ్రిక్ నుంచి సులువుగా తొలగిస్తాయి. ఏదైనా ఫాబ్రిక్‌పై ఇలా చేసే ముందు, ముందుగా ఫాబ్రిక్ అంచున దాన్ని పరీక్షించడం మంచిది.
క్లీనర్లు సిరా మరకలను తొలగిస్తాయా?
అదృష్టవశాత్తూ, మీ స్థానిక డ్రై క్లీనర్లు వివిధ రకాల స్టెయిన్ రిమూవల్ టెక్నిక్‌లలో అనుభవం కలిగి ఉన్నారు మరియు మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నారు. మీకు ఇష్టమైన చొక్కా సిరా మరకకు గురైతే, దానిని నేరుగా డ్రై క్లీనర్ వద్దకు తీసుకెళ్లండి. మరకను తొలగించడానికి ప్రయత్నించవద్దు, ఎందుకంటే ఇది ఫాబ్రిక్‌గా లేదా పెద్ద ప్రాంతాలకు వ్యాపించవచ్చు.
ఉప్పు సిరా మరకలను తొలగించగలదా?
సిరా మరకలను తొలగించడం చాలా కష్టం, కానీ ఉప్పు సిరాను విచ్ఛిన్నం చేయడానికి మరియు ఫాబ్రిక్ అంతటా వ్యాపించకుండా నిరోధించడానికి సహాయపడుతుంది . ఉప్పు యొక్క రాపిడి స్వభావం పదార్థానికి హాని కలిగించకుండా ఫాబ్రిక్ నుండి కొంత సిరాను తొలగించడానికి సహాయపడుతుంది.
సిరాను ఏ పదార్థం తొలగిస్తుంది?
ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అని కూడా పిలుస్తారు, రుబ్బింగ్ ఆల్కహాల్ అనేక కారణాల వల్ల బాల్ పాయింట్ పెన్ సిరాను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Red Wine : రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదేనా..?