నెల్లూరు : నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగకు మూడో రోజు భక్తులు
పోటేత్తారు. మంగళవారం సుమారు నాలుగులక్షల మందికి (For four hundred thousand people) పైగా భక్తులు దర్గాను దర్శించుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఎండ బాగా వున్నప్పటికీ భక్తుల రద్దీ కొనసాగింది. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా భక్తులు రొట్టెల పండుగకు విచ్చేసినట్లు అధికారులు అంచనా వేశారు. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ ఆనంద్ (District Collector Anand), ఎస్పీ కృష్ణ కాంత్, మున్సిపల్ కమిషనర్ నందన్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అన్ని చర్యలు చేపట్టడంతో భక్తులందరూ సజావుగా దర్గాను దర్శించుకుని, రొట్టెలు మార్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. కోర్కెలు తీరిన వారు రొట్టెలను ఇవ్వడం.

సజావుగా సాగేలా
కోర్కెలతో వచ్చిన వారు ఆ రొట్టెలను స్వీకరించడం వంటి దృశ్యాలతో స్వర్ణాల చెరువు ఘాట్ పరిసర ప్రాంతాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఉద్యోగం వివాహం సంతాన రొట్టెల కు డిమాండ్ పెరిగింది. జిల్లా యంత్రాంగం పటిష్టంగా చేపట్టిన ఏర్పాట్ల పట్ల సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దర్గా ప్రాంగణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, క్యూలైన్లు సజావుగా సాగేలా, శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీస్ కంట్రోల్ రూం 24 గంటలూ అనౌన్స్మెంట్ (Announcement) చేస్తూ ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. తప్పిపోయిన చిన్నారులను, వృద్ధులను వెంటనే సంబంధికులకు అప్పగిస్తున్నారు. భక్తులు పోగొట్టుకున్న పర్సులను అందిస్తున్నారు. ఈ మూడు రోజుల్లో సుమారు 100 మందికి పైగా తప్పిపోయిన వారిని గుర్తించి వారి సంబంధికులను అప్పగించారు. దీంతో పోలీసు కంట్రోల్ రూం సేవలను అందరూ శభాష్ అని మెచ్చుకుంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Atchannaidu: తోతాపురి మామిడి రైతుకు చేయూత ఇవ్వండి
రొట్టెల పండుగ జరుపుకునే రాష్ట్రం ఏది?
ఐదు రోజుల వార్షిక పండుగ ‘రోటియాన్ కీ ఈద్’ లేదా ‘రొట్టెల పండుగ’ జూలై 6 నుండి నెల్లూరులో ప్రారంభమవుతుంది , ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడు నుండి లక్షలాది మంది ప్రజలు స్వర్ణాల చెరువు సమీపంలోని బారా షహీద్ దర్గాను సందర్శించి రొట్టెలు మార్చుకునే అవకాశం ఉంది.
రొట్టెల పండుగ అంటే ఏమిటి?
మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే ఈ పండుగను రొట్టెల పండుగ అంటారు. ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు.