CBSE బోర్డు 10వ మరియు 12వ తరగతుల సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసింది. ప్రైవేట్‌గా పరీక్షలు రాయనున్న విద్యార్థులు CBSE అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్ లేకుండా పరీక్షకు అనుమతి ఉండదని బోర్డు అధికారులు స్పష్టం చేశారు.
రెగ్యులర్ విద్యార్థులకు పాఠశాలల నుంచే హాల్ టికెట్లు
రెగ్యులర్ విద్యార్థులు తమ స్కూళ్లకు వెళ్లి హాల్ టికెట్లు సేకరించాలి. స్కూల్ ప్రిన్సిపాల్లు వాటిని విద్యార్థులకు అందజేస్తారు. పరీక్షకు ముందుగా హాల్ టికెట్ తీసుకోవడం, వివరాలను సరిచూసుకోవడం తప్పనిసరి. హాల్ టికెట్‌పై ఎలాంటి తప్పులు ఉంటే వెంటనే స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించి సరిదిద్దుకోవాలి.
పరీక్షలు జూలై 15 నుంచి ప్రారంభం
సప్లిమెంటరీ రాత పరీక్షలు జూలై 15, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే జూలై 10 నుండి 15వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు CBSE తెలిపింది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు హాల్ టికెట్లతో పాటు గుర్తింపు పత్రాలు కూడా తీసుకురావాలని సూచించారు. పరీక్షల కోసం మౌలిక సదుపాయాలన్నీ సిద్ధం చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
Read Also : Chandrababu Naidu : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చంద్రబాబు స్పష్టత