బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) తీవ్ర విమర్శలు చేశారు. తమ సుదీర్ఘ రాజకీయ అనుభవం ముందు కేటీఆర్ ఒక జీరో అని, ఆయన ఒక చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CMReventh Reddy)ని చర్చకు పిలిచే స్థాయి కేటీఆర్‌కు లేదని అన్నారు. మంగళవారం నాడు గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి, కేటీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రశ్నించారు. “మేమంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి క్షేత్రస్థాయి నుంచి నాయకులుగా ఎదిగాం. కేటీఆర్ తన తండ్రి సీటిస్తే నేరుగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయనెప్పుడైనా సర్పంచ్‌గా గెలిచారా? జడ్పీటీసీగా గెలిచారా? రాజకీయాల్లోని కష్టనష్టాలు, ఒడిదుడుకులు ఆయనకు ఎలా తెలుస్తాయి?” అని జగ్గారెడ్డి నిలదీశారు.

ఆయన తీవ్ర ఒత్తిడిలో వున్నారు
కేటీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని, కాంగ్రెస్ నేతలను “గాడిదలు” అంటూ విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. “మీరు మమ్మల్ని ఒక మాట అంటే మేము పది మాటలు అంటాం. మీరు ముఖ్యమంత్రిని దూషించడం ఆపేస్తే, మేము కూడా ప్రతి విమర్శలు ఆపేస్తాం” అని స్పష్టం చేశారు. 18 నెలలు అధికారం లేకపోయేసరికి కేటీఆర్ గట్టున పడ్డ చేపలా కొట్టుకుంటున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. సోదరి కవిత అరెస్టు వ్యవహారంతో ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, అందుకే తరచూ విదేశీ పర్యటనలకు వెళుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను విమర్శించే ముందు కేటీఆర్ బాగా అధ్యయనం చేయాలని సూచించారు .
జగ్గారెడ్డి రాజకీయ చరిత్ర ఏమిటి?
రాజకీయ జీవితం
ఆయన బిజెపిలో కౌన్సిలర్‌గా కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ అయ్యారు. 2004లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. 2009లో తిరిగి ఎన్నికయ్యారు, కానీ 2014లో ఓడిపోయారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Rahul: ట్రంప్‌కు మోదీ అడుగులకు మడుగులొత్తుతారు: రాహుల్ గాంధీ