తెలుగు సినీ ఇండస్ట్రీలో చలం ఓ భిన్నమైన శబ్దం. శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు వంటి సీనియర్ స్టార్ హీరోలు బరిలో ఉన్నా… చలం (Chalam) తనదైన నటనతో మిగతా అందరికీ భిన్నంగా నిలిచారు. ఆయన సినిమాలు ప్రేక్షకులను భవిష్యత్తులో ఎదో విశేషం కనిపిస్తుందన్న ఆశతో థియేటర్లకు రప్పించేవి. కథల ఎంపికలో చలం చూపే చురుకుదనం, పాటలపై ఆయనకు ఉండే పట్టు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం కల్పించాయి.సీనియర్ దర్శకుడు నందం హరిశ్చంద్రరావు (Director Nandam Harischandra Rao) ఓ ఇంటర్వ్యూలో చలాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పారు:”చలం గారు స్టెప్ బై స్టెప్ ఎదిగారు. మొదట చిన్న పాత్రలు, తర్వాత కామెడీ రోల్స్… అంతలోనే హీరోగా ఎదిగారు. తెలుగు తెరపై కమెడియన్ నుంచి హీరోగా మారిన తొలి నటుడు ఆయనే. ఆయన జీవితం కూడా సినిమాలా ఉత్కంఠభరితంగా ఉంది.”

వివాహ జీవితంలో తేడా, తిరుగుబాటు
చలం మొదట ఓ జమీందార్ మనవరాలిని పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఆయన కెరీర్ లో మంచి ఊపొచ్చింది. కానీ ఆమె మృతితో ఆయన లోపల నుండి నలిగిపోయారు. అదే సమయంలో శారదతో కలసి నటిస్తూ ప్రేమలో పడ్డారు. అలా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
శారదతో సమస్యలు, ఎన్టీఆర్ జోక్యం
ఆ పెళ్లి తర్వాత చలం నడవడిలో తేడాలు మొదలయ్యాయి. షూటింగ్‌లలోకి వెళ్లి శారదతో ఘర్షణ పడే స్థాయికి వెళ్ళారు. దీనిపై ఒకసారి సెట్లో ఉన్న ఎన్టీఆర్ సైతం చలాన్ని పిలిచి మందలించారట. కానీ పరిస్థితులు మెరుగయ్యేలా కనిపించలేదు. చివరికి శారద విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.ఈ సంఘటనల తరువాత చలం పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. కెరీర్‌కి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యం పోయింది. ఓ వెలుగు ప్రస్థానం… అర్థాంతరంగా చీకటిలోకి మసులుకున్న జీవితం.
Read Also : Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ ప్రీరిలీజ్ ఎక్కడంటే?