నీకే కాదోయ్ ఓ మేఘమా' తుఫానులు సృష్టించడం వాయుగుండాలను పుట్టించడం తీరాలను దాటించడం జనాలను అటూ ఇటూ తుపాను పరుగెత్తించడం మనులమైన మాకూ చేతనవ్వు నీలా విధ్వంసం దేయం, కానీ మేం తీరాలను దాటిస్తే తట్టుకోలేనివారు వాంతులు భరించే ముక్కు భలులు మూసుకుంటారు. పిరికివారు పారిపోతారు. తల తిరిగి కొందదు పడిపోతారు. చేసేది లేక ఇంటివారు.
హం. అంటు అదోలా చూస్తారు. ఉపశమన నిమిత్తం శనగపిండి వంటకాలు కొన్నాళ్లు. శనగ దినుసుల వంటలు ఇంకొన్నాళ్లు మళ్లీ బంగాళాఖాతంలో వాయుగుండమని హెచ్చరికలు.. టి.వి. ఛానళ్లు, మేం ముందు చెప్పాలి.. మేం ముందు చెప్పాం అని డిబేటింగ్ పెట్టగానే మనవాళ్లు మనవైపు అదోలా చూస్తారు.. మన శక్తి సామర్థ్యాలు తెలుసుకుని భయపడి ఉప్పెనలు మరో రాష్ట్రం వైపు తీరం మార్చుకుంటాయని తెలిసి
హ్హ..! మనమూ సముద్రనికేమి తీసిపోం
Nature Destruction: పర్యావరణానికి ప్రమాదం..
సృష్టిలో కోట్లాది జీవరాశులు పిదవ
నీవు అవతరించావు.
సమస్త జీవకోటి సమానం అనే
ప్రకృతి మాత ఆశయానికి తూట్లు పొడిచావు.
ప్రకృతి అంతా నీ జాగీరు అనుకుని
సహజ వనరులను పీల్చి పిప్పి చేసావు..
భావితరం వేరొకటి ఉంటుందని స్పృహ లేకున్నావు.
వనరులన్నీ దోరి భావితరానికి ఖాళీ పాత్ర ఇవ్వబోతున్నావు.
ఏ పాపం. ఎరుగని మూగ జీవాలను
నీ స్వార్థంతో అంతరింపచేస్తున్నావు.
జీవ వైవిధ్యంతో అసమతౌల్యం
నీ ఉనికికి మున్నని గ్రహించకున్నావు.
హరిత విప్లవం పేరిట అధిక దిగుబడి సాధించావు
భుక్తిని ఇచ్చే పురమిహజత్వాన్ని చిదిమేశాలు.
పవిత్ర జీవ నదులను అభివృద్ధి పేరిట
కాలుష్య కాసారంగా మార్చావు.
నీ మనుగడకు ఊపిరినిచ్చే
వన దేవతలను కూకటి వేళ్లతో పెకలిస్తున్నావు.
సౌకర్యవంత జీవనం నీ పేడుతో కర్బన ఉద్గారాలు వెదజల్లుతున్నావు.
ప్రమాద ఘంటికలు మోగిస్తున్నావు.
ఇవన్నీ నీ ఉనికికే ప్రమాదం అని గుర్తించలేకున్నావు పర్యావరణాన్ని పర్యాహరణం చేస్తున్నావు..
భావితరాలకు శోకం మిగులుస్తున్నావు.
నువ్వు సృష్టించిన ఈ వివత్తుకు నువ్వే సమిదవు
కాబోతున్నావని తెలుసుకోలేకున్నావు..
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.