ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు RTGS (Real Time Governance Society) సమీక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నేరాల నిరూపణలో టెక్నాలజీని సమర్థంగా వినియోగించాలని ఆయన సూచించారు. కొన్ని సంఘటనల్లో, రాజకీయ ముసుగులో కొందరు వ్యక్తులు తెలివిగా నేరాలకు పాల్పడుతూ, ఆ నేరాలను ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
నేరస్తులపై పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రయోగం
పోలీసులకు సహకరించని వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం (Chandrababu) సూచించారు. ముఖ్యంగా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం, అవసరమైతే వారి నుండి డేటాను సేకరించి విచారణ చేయాలని సూచించారు. నేరానికి పాల్పడిన వారు తప్పించుకోకుండా, సాంకేతిక ఆధారాలతో వారి తప్పులను నిరూపించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
బాధ్యులుగా నిలిపేందుకు కఠిన చర్యలు అవసరం
నేరం చేసిన వారిని తప్పకుండా బాధ్యులుగా నిలిపేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల భద్రతే తన ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యతగా పేర్కొంటూ, నేరాలను అరికట్టే చర్యల్లో పోలీసులు, విచారణా అధికారులు సమర్థతతో పనిచేయాలని సూచించారు. అన్ని రంగాల్లో టెక్నాలజీ వినియోగంతో నేరాల నివారణ సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also : Y. S. Sharmila : ఆర్కిటెక్చర్ విద్యార్థులను ఎందుకు పట్టించుకోవట్లేదు? – షర్మిల