Hindhu Mythology: ఋషభుడి కొడుకు భరతుడు, తండ్రి దయతో పట్టాభిషిక్తుడైన (Crowned) భరతుడు ఆయన ‘హీతోపదేశాన్ని తూ.చ. పాటిస్తూ వచ్చాడు. అతని పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు. విశ్వరూపుడు అనే ఓ రాజు కుమార్తెను పెళ్లాడాడు. ఆమె పేరు పంచజని. భరతుడి దంపతులకు అయిదుగురు పుత్రులు పుట్టారు. వారి పేర్లు-సుమతి, రాష్ట్రభుక్, సుదర్శనుడు. ఆచరనుడు. ధూమ్రకేతువు.

భరతుడికి పూర్వం మన దేశానికి అజనాభం అని పేరు ఉండేది. అయితే ఎప్పుడైతే భరతుడు జనరంజకంగా పాలించడం మొదలుపెట్టాడో అప్పుడు మన దేశానికి భారతవర్షం అనే పేరు ఏర్పడింది. ఇది క్రమంగా వ్యవహార నామమైంది. భరతుడు యజ్ఞయాగాదులు చేసేవాడు. హరి కృపను పొంది యజ్ఞఫలాన్ని భగవంతుడికే అర్పించాడు. ఆ తర్వాత తన కుమారులకు రాజ్యం అప్పగించి ముముక్షువుగా మారి పులహాశ్రమం చేరి తపస్సు చేయసాగాడు. ఓ రోజు భరతుడు గండకీ నదిలో స్నానం చేసి నీటిలో నిల్చుని ప్రణవం జపించసాగాడు. ఆ సమయంలో గర్భంతో ఉన్న ఓ ఆడ జింక దాహమేసి నీరు తాగడం కోసం అక్కడికి వచ్చింది.
అది నీటిలో దిగుతుండగా ఓ సింహం అక్కడికి వస్తూ భీకరంగా గర్జించింది.ఆ గర్జనకు భయపడిన జింక తన ప్రాణాలు కాపాడుకోవాలనుకుని దాహం తీర్చుకోకుండానే అక్కడి నుంచి పారిపోయింది. అయితే అప్పటికే గర్భిణిగా ఉన్న ఆ జింకలోని శిశువు గర్భస్రావమై నదిలో పడింది. మరోవైపు తప్పించుకుని పారిపోయిన జింక కాస్తా పక్కనున్న కొండ మీద నుంచి జారి పడి ప్రాణాలు కోల్పోయింది. అది కన్న జింక పిల్లను భరతుడు తీసుకుని ఆశ్రమం చేరాడు. దాన్ని కంటికి రెప్పలా పెంచసాగాడు. తన సర్వస్వం ధారపోసి దాన్నిచూసుకుంటూ వచ్చాడు భరతుడు.

కన్న ప్రేమకంటే పెంచిన ప్రేమ మిన్న అనే మాట అక్షరాలా నిజమైంది. దాన్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాడు. భరతుడు. దానికి అడవి మృగాల నుంచి ఏ ఆపదా రాకుండా ఉండడం కోసం భరతుడు తన భుజాల మీద మోసుకుంటూ పోతుండేవాడు

తప్పిపోయిన జింకపిల్ల.. భరతుని ఒడిలో ఆనందం!
ఓ రోజు ఆ జింకపిల్ల ఆశ్రమం నుంచి కొంత దూరం వెళ్లింది. అది తిరిగి వస్తున్నప్పుడు దారి తప్పిపోయింది.దాంతో భరతుడి బాధ వర్ణనాతీతం.తట్టుకోలేకపోయాడు. దాని కోసం.అడివంతా గాలించాడు. కానీ, దాని అచూకీ లేదు బాధపడిపోయాడు. ఎక్కడని వెతకను.. అని అనుకుంటూ దిగాలుపడి కూర్చున్న వేళ అది ఎక్కడి నుండో పరుగున వచ్చి ఆయన ఒడిలో వాలింది. అంతే..! ఆ క్షణంలోనే భరతుడి బాధంతా మటుమాయమైంది. పట్టరాని ఆనందం కలిగింది.
రాజ్యాభిషిక్తుడైనప్పుడు చేసే గజారోహణం చేసినంత ఆనందం కలిగింది. నోట మాట రాలేదు. జింకను గాఢంగా కౌగిలించుకున్నాడు. జింక పిల్లే తన జీవితమన్నట్టు జీవించసాగాడు. రోజులు సాగిపోతున్నాయి. భరతుడికి మృత్యుఘడియలు సమీపించాయి. త సమయంలోనూ దానినే తలచుకుంటూ భరతుడు చనిపోయాడు. మరణవేళ మనసు ఏదనుకుంటే అదే గతి పడుతుందని పెద్దల మాట. ఆ విధంగా భరతుడు తదుపరి జన్మలో ఓ జింకగా పుట్టాడు. అయితే గత జన్మలో దీర్ఘకాలం చేసిన తపోనిష్ఠ వల్ల జింకగా పుట్టినప్పటికీ అతనికి పూర్వ జన్మ జ్ఞానం లోపించలేదు.

జింక మీది ప్రేమతో సరిగ్గా తపస్సు చేయలేకపోయానే..! అని భాధపడసాగాడు. మోక్షానికి దూరమయ్యాను కదా.. అనుకున్నాడు. పులహాశ్రమం పరిసర ప్రాంతంలోనే సంచరిస్తూ అక్కడి నుంచి వినిపించే హరి నామ సంకీర్తనం వింటూ జీవితం గడపసాగాడు. అచిర కాలంలోనే ప్రాణం విడిచాడు. జ్ఞానంతో మరణించిన కారణంగా మరుసటి జన్మలో అంగీరసుడనే మహర్షికి పుత్రుడై జన్మించాడు.
Hindhu Mythology: భరతుడి చరిత్ర ఏమిటి?
భరతుడు అనే మహానుభావుడు హిందూ పురాణాలలో ఎంతో ప్రాధాన్యం పొందిన చక్రవర్తిగా పేర్కొనబడ్డాడు. భారతదేశానికి “భారతం” అనే పేరు ఆయన పేరు నుంచే వచ్చిందని విశ్వసించబడుతుంది. ఆయన శకుంతల మరియు రాజా దుష్యంతుల కుమారుడిగా జన్మించాడు. భరతుని జీవిత కథ మహాభారతంలో, అలాగే కవి కాళిదాసు రచించిన “అభిజ్ఞాన శాకుంతలం” నాటకంలో కూడా ప్రముఖంగా ప్రస్తావించబడింది. చిన్ననాటి నుంచే ధైర్యసాహసాలు ప్రదర్శించి, తన న్యాయ పరిపాలనతో ఓ ఆదర్శవంతుడైన రాజుగా నిలిచాడు.