हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

TG High Court: డిప్లొమా కోర్సు ఇంటర్మీడియట్‌కు సమానమే.. హైకోర్టు తాజా తీర్పు

Sharanya
TG High Court: డిప్లొమా కోర్సు ఇంటర్మీడియట్‌కు సమానమే.. హైకోర్టు తాజా తీర్పు

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్హతల విషయంలో అస్పష్టతలను తొలగిస్తూ, ఒక విద్యార్థి హక్కులను సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు (TG High Court) మరో కీలక తీర్పు ఇచ్చింది. డిప్లొమా కోర్సులకూ ఇంటర్మీడియట్ కోర్సులకు సమాన హోదా కల్పిస్తూ, అభ్యర్థుల భవిష్యత్‌కు మార్గం సుగమం చేసింది.

ఎక్కడి నుంచి ప్రారంభమైంది వివాదం?

కాంపెల హరీష్ అనే విద్యార్థి డీసెట్ (Diploma in Elementary Education Common Entrance Test) ద్వారా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) లేదా డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ (DPSE) కోర్సులో ప్రవేశం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతను పూర్తిచేసిన డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ కోర్సును ఇంటర్మీడియట్‌కు సమానంగా పరిగణించలేమని పేర్కొంటూ, అతని దరఖాస్తును తిరస్కరించారు.

పిటిషన్ వివరాలు

దీంతో హరీష్ హైకోర్టును ఆశ్రయించాడు. పిటిషనర్ తరపు న్యాయవాది విజయ్ కుమార్ పానుగంటి వాదనలు వినిపిస్తూ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ జారీ చేసిన అక్టోబర్ 27, 2001 నాటి జీఓ 112 ప్రకారం డిప్లొమా ఇంటర్మీడియట్ కోర్సుతో సమానమని పేర్కొన్నట్లు తెలిపారు. పిటిషనర్‌ డీఈఈ కోర్సు ఎంట్రన్స్‌లో ర్యాంకు పొందారని, సర్టిఫికెట్‌ల ధ్రువీకరణకు వెళితే ఇంటర్మీడియట్‌ కోర్సు లేదంటూ నిరాకరించారన్నారు. ఉన్నత విద్య తరపు ప్రభుత్వ న్యాయవాది కూడా ఈ కోర్సు ఇంటర్మీడియట్ కోర్సుతో సమానంగా ఉందని అన్నారు.

ప్రతివాద శాఖల వాదనలు

పాఠశాల విద్యా శాఖ తరపు న్యాయవాది దీనిని విభేదిస్తూ సాంకేతిక విద్యా మండలి అందించే డిప్లొమా కోర్సులో తెలుగు లేదా ఇంగ్లీష్ వంటి భాషలు లేవని వాదించారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా ప్రీ-స్కూల్ విద్యలో ప్రవేశానికి భాషల అధ్యయనం అవసరమన్నారు. డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పదవికి అర్హులు అవుతారని, వారు భాషలను అధ్యయనం చేయకుండా విద్యార్థులకు బోధించలేరని వాదించారు.

హైకోర్టు తీర్పు ఏమి చెప్పింది?

జస్టిస్ కె. లక్ష్మణ్ విచారణ చేసి, పాఠశాల విద్యా శాఖ వాదనలను తిరస్కరించారు. కోర్టు ఆ వాదనను ఖండించింది. 2001లో ప్రభుత్వమే GO జారీ చేసినప్పుడు ఎవరైనా దానికి విరుద్ధంగా ఎలా వెళ్లగలరని కోర్టు (TG High Court) ప్రశ్నించింది. డిప్లొమా జారీ చేసిన సాంకేతిక బోర్డు అది ఇంటర్మీడియట్‌కు సమానమైన కోర్సుగా పేర్కొంది. అందువల్ల డీఈఈసెట్‌లో ఇంటర్‌ అర్హత లేదని ప్రవేశం నిరాకరించడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేశారు. ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన సదరు విద్యార్ధికి అడ్మిషన్‌ ఇవ్వాలని కన్వీనర్‌ను కోర్టు ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: TG TET: తెలంగాణ టెట్‌ 2025 ఆన్సర్ కీ విడుదల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870