రాజస్థాన్ రాష్ట్రంలో నమ్మలేని మోసం వెలుగులోకి వచ్చింది. ఎస్సై పరీక్షలో ఫెయిల్ అయినా నకిలీ పత్రాలతో (Fake documents) పోలీస్ ట్రైనింగ్ పూర్తిచేసిన యువతిపై పోలీసులు పరస్పర ఆశ్చర్యంతో కేసు నమోదు చేశారు. ఈ మోసానికి పాల్పడింది నాగోర్ జిల్లాకు చెందిన మోనా బుగాలియా (Mona Bugalia) అనే యువతి. ఏడాదిగా పరారీలో ఉన్న ఆమెను తాజాగా అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.2021లో ఎస్సై పరీక్ష రాసి విఫలమైన మోనా, తన పేరును మూలీదేవిగా మార్చింది. తర్వాత నకిలీ పత్రాలు తయారు చేసి స్పోర్ట్స్ కోటాలో ఎంపికైనట్టు నటించింది. కొత్తగా ఎంపికైన అభ్యర్థుల వాట్సాప్ గ్రూపులో చేరి, నేరుగా అకాడమీలో ట్రైనింగ్ ప్రారంభించింది.

రెండేళ్ల పాటు ట్రైనీ ఎస్సైలా నటన
మోనా అకాడమీలో రెండు సంవత్సరాలు సాధారణ ట్రైనీ ఎస్సైలా వ్యవహరించింది. డ్రిల్లులు, తరగతులు, అధికారులతో సమావేశాలు అన్నింట్లో పాల్గొంది. ఐపీఎస్ అధికారుల సమక్షంలో ప్రసంగించే వరకు వెళ్లింది. సోషల్ మీడియాలో స్ఫూర్తిదాయకంగా వ్యవహరించడంతో ఎవరికీ అనుమానం రాలేదు.ఆమె వ్యవహారంపై అనుమానం వచ్చిన కొంతమంది ట్రైనీలు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తర్వాత జరిగిన విచారణలో మోసాన్ని తాను ఒప్పుకుంది. కుటుంబ సభ్యులను ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యకు ఒడిగట్టినట్లు తెలిపింది.
నకిలీ పత్రాలు, నగదు, యూనిఫామ్‌లు స్వాధీనం
మోనా నివాసాన్ని పోలీసులు తనిఖీ చేశారు. అక్కడి నుంచి రూ. 7 లక్షల నగదు, నకిలీ డాక్యుమెంట్లు, పోలీస్ అకాడమీ ప్రశ్నపత్రాలు, మూడు నకిలీ యూనిఫామ్‌లు స్వాధీనం చేసుకున్నారు.సామాజిక గౌరవం కోసం మొదలైన ఈ మోసం చివరకు జైలులో ముగిసింది. రెండేళ్లు పూర్తవుతున్న సరికి ఆమె నిజాలు వెలుగులోకి రావడం, పోలీస్ వ్యవస్థలో భద్రతా లోపాలను కలిగించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also : AIIMS Mangalagiri : మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్‌పై కఠిన చర్యలు