రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసింది బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు
హైదరాబాద్ : తెలంగాణ బిజెపిలోని అసమ్మతి నేతలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బిజెపిలో ఎంత పెద్ద నాయ కుడు అయినా పార్టీ సిద్ధాంతానికి, క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీ నిబంధనలను, క్రమశిక్షణను మీరితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదని, ఎవరు పార్టీ నుంచి వెళ్లిపోయినా పెద్ద నష్టమేం లేదని తేల్చి చెప్పారు. ఒకప్పుడు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు బల్ రాజ్ మధోక్ కూడా పార్టీ నియమాలను మీరితే సస్సెండ్ చేశారనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టు కోవాలన్నారు. అయితే ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గురించే రామచందర్రావు (Ramachandra Rao) పరోక్షంగా ఈ వ్యాఖ్యలు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. న్యాయాన్ని, రాజ్యాంగ విలువలను ఖూనీ చేసింది కాంగ్రెస్పదే పదే ప్రజలను మభ్యపెట్టే నినాదాలు చెప్పే కాంగ్రెస్ వాటికి విరుద్ధంగా పనిచేయడమే తన నిజమైన ధోరణి.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు
సామాజిక న్యాయానికి తూట్లు కాంగ్రెస్ న్యాయo అంటూ పొడుస్తున్న ‘సామాజిక సమరభేరి’ మరోసారి తెలంగాణ ప్రజలను మాయ చేయాలని ప్రయత్నం చేస్తోందని రామ చందర్రావు ఆరోపించారు. ఏడాదిన్నర పాలనలో ఒక్క హామీని కూడా సమర్థంగా అమలు చేయలేకపోయిన ప్రభుత్వం ప్రజలకు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నిం చారు. జై బాపు అంటూ నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, గాంధీజీ కలల గ్రామ స్వరాజ్యాన్ని నిర్వీర్యం చేసిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local body elections) జరపకపోవడం, గ్రామాభివృద్ధి పనుల బిల్లులకు రూ.1,200 కోట్లు పెండింగ్ లో పెట్టడం ఇవన్నీ గాంధీజీ స్పూర్తికి విరుద్ధమన్నారు. ‘జై భీమ్’ అంటూ నినదిస్తున్న కాంగ్రెస్, వాస్త వంగా లగచర్ల, కొండగల్ వంటి ప్రాంతాల్లో గిరిజనుల భూములు లాక్కొని, పోడు భూములపై బుల్డోజర్లు పంపి, ఎస్టీ రైతులపై కేసులు బనాయించి, యిం గురుకులాల మూసివేతలతో దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు.

ఏ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందన్నారు
“జై సంవిధాన్’ అని పఠించే ముందు కాంగ్రెస్ పార్టీ తన చరిత్రను గమనిం చాలన్నారు. 1975లో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పార్టీకి రాజ్యాంగంపై బోధనలు చెప్పే అర్హత లేదన్నారు. ఇవన్నీ మరిచినట్టుగా మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) తెలంగాణకు వచ్చారు. కానీ ప్రజల మనసులో ఉన్న అసలైన ప్రశ్న ఒక్కటే ఖర్గే, కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకుని సభ నిర్వహిస్తోందని నిలదీశారు. 205 దోచుకోవడానికి ఏమి మిగిలింది? కర్ణాటక, హిమాచలప్రదేశ్, తెలంగాణ, ఈ మూడు రాష్ట్రాలూ కాంగ్రెస్ దోపిడీకి అక్షయపాత్రలుగా మారాయని ఆయన ఆరోపించారు. తెలంగాణలో 6 గ్యారంటీలు,13 హామీలు అంటూ భారీగా హడావుడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందన్నారు. కులగణన పేరిట బిసిలకు అన్యాయం చేసి, ముస్లింలను బిసి కోటాలో చేర్చడమే కాంగ్రెస్ సామాజిక న్యాయమా అని ప్రశ్నించి ఆయన కాంగ్రెస్ హామీలు మాటలకే పరిమితమై పోయాయని, మాయ నినాదాలతో ప్రజలను మోసం చేయడమే ఈ ప్రభుత్వ ధోరణి అన్నారు. కాంగ్రెస్ ఈ సభ నిర్వహించేది సామాజిక న్యాయం కోసం కాదు సామాజిక న్యాయానికి తూట్లు పొడవడానికే. తెలంగాణ ప్రజలు మళ్లీ మోసపోరని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com