మహబూబ్‌నగర్ (Mahabubnagar) శివారులోని బోయపల్లి గేట్ వద్ద రామగుండం నుంచి తమిళనాడుకు వెళుతున్న గూడ్స్ రైలు (Goods Train) లోని ఓ బోగీ పట్టాలు తప్పింది. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. 6వ నెంబరు బోగీ 20 మీటర్ల వరకు పట్టాల మీద సిమెంట్ స్లీపర్లపైకి ఎక్కి ట్రాక్‌ను దెబ్బతీసింది.బోగీ ప్రమాదాన్ని వెంటనే గమనించిన లోకో పైలట్, రైలును తక్షణమే నిలిపివేశారు. లేకపోతే ప్రమాదం మరింత పెద్దదై ఉండేదన్నది స్పష్టం. పైలట్ చాకచక్యంతో ఇతర బోగీలు బాగుండగా, మిగిలిన ట్రైన్ సురక్షితంగా నిలిచిపోయింది.

రైళ్ల రాకపోకలకు భారీ అంతరాయం
ఈ ఘటనతో మహబూబ్‌నగర్-కర్నూలు మార్గం పూర్తిగా స్తంభించిపోయింది. చెంగల్పట్టు, హంద్రీ, మైసూర్, సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ వంటి పలు రైళ్లు మార్గమధ్యంలో నిలిచిపోయాయి. ఈ ట్రైన్లలో ఉన్న ప్రయాణికులు గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. పలు స్టేషన్లలో ప్రయాణికులు వర్షం మధ్యా ఎదురుచూపులతో తీవ్ర ఇబ్బందులు పడారు.
రైల్వే అధికారులు స్పందన – పునరుద్ధరణ పనులు ప్రారంభం
పట్టాలు తప్పిన సమాచారం వెంటనే అధికారులు స్పందించారు. కాచిగూడ నుంచి ప్రత్యేక యాక్షన్ రిలీఫ్ ట్రైన్‌ను తరలించారు. సంఘటన స్థలానికి చేరుకొని ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించారు. మరమ్మత్తులు పూర్తయిన తర్వాతే రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశముంది.
ప్రయాణికుల ఆగ్రహం – సమాచార లోపంపై విమర్శలు
పలు స్టేషన్లలో ప్రయాణికులు సమాచారం లేక ఇబ్బందులు పడ్డారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో వారు ట్రైన్‌లోనే నిరీక్షించాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో సమాచారం లేకపోవడాన్ని కొందరు తీవ్రంగా విమర్శించారు.
Read Also : Love Bugs : దక్షిణ కొరియాలో ‘లవ్ బగ్స్’ విజృంభణ