हिन्दी | Epaper
వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు

sajjala payasam recipe: సజ్జల పాయసం త‌యారీ విధానం

Digital
sajjala payasam recipe:  సజ్జల పాయసం త‌యారీ విధానం

sajjala payasam recipe:

సజ్జల పాయసం
అది వినాయక చవితి రోజు. అమ్మ వంటింట్లో బిజీగా ఉంది. వంటింటి నుంచి వాసనలు బయటకు వస్తున్నాయి. నెయ్యిలో వేయించిన జీడిపప్పు వాసన, బాదంపప్పు వాసన… అబ్బా! ఆ వాసనకి నా మనసు ఊరుతూనే ఉంది.అప్పుడు అమ్మ నన్ను పిలిచింది –“ఈ రోజు నీకు ఇష్టమైన సజ్జల(sajjala payasam recipe) పాయసం చేసాను బంగారం… వేడి వేడి ఉన్నప్పుడు తిను!” అని అనింది.అప్పుడు అమ్మ చేతిలో నుంచి గిన్నె తీసుకుని తిన్నాను. ఎంత రుచిగా ఉంది సజ్జల పాయసం! సజ్జలు, బెల్లం, పాలు… అన్నీ కలిసి ఎంతో రుచిగా ఉంది. ఆ రుచితో పాటు అమ్మ చూపు, మాట, ప్రేమ కూడా గుర్తుండిపోయింది.ఆ రోజు తర్వాత… ఎప్పుడు సజ్జల పాయసం తిన్నా… ఆ అమ్మ ప్రేమే గుర్తొస్తుంది.

కావలసిన పదార్థాలు:

  • సజ్జలు (పెర్ల్ మిల్లెట్) – 1 కప్పు
  • సేమియా – 1/2 కప్పు
  • బెల్లం – 1 కప్పు (తరిగినది)
  • పాలు – 4 కప్పులు
  • డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, కిస్మిస్) – 1/4 కప్పు
  • నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
  • యాలకుల పొడి – 1/4 టీస్పూన్

తయారు చేసే విధానం:

ముందుగా సజ్జలను(sajjala payasam recipe) రెండు నిమిషాల పాటు సన్నని మంటపై వేయించి, బాగా కడిగి గంటసేపు నానబెట్టాలి.స్టౌ మీద కడాయి పెట్టి నెయ్యి వేడి చేసి, అందులో బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే సేమియాను కూడా స్వల్పంగా వేయించి పక్కన పెట్టాలి.అదే కడాయిలో పాలు పోసి బాగా మరిగాక, నానబెట్టిన సజ్జలు(sajjala payasam recipe) జోడించి 10 నిమిషాలు ఉడికించాలి.తరువాత వేయించిన సేమియా, తరిగిన బెల్లం జత చేసి మరో 5 నిమిషాలు కలుపుతూ ఉడికించాలి.చివరగా యాలకుల పొడి మరియు వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపితే… రుచికరమైన సజ్జల పాయసం(payasam) సిద్ధం!

sajjala payasam recipe
sajjala payasam recipe

Read Hindi News:hindi.vaartha.com

Read Also: Meal Maker Masala Vada Recipe: మిల్మేకర్ వడ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870