ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మళ్లీ ఒకసారి తీవ్ర హెచ్చరికలతో వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల ప్రకాశం జిల్లా మార్కాపురం (Markapuram) లో ఏర్పాటు చేసిన రక్షిత తాగునీటి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. వైసీపీ నాయకుల తీరుపై గట్టిగా స్పందించిన పవన్, భయపెట్టే ప్రయత్నాలకు తలొగ్గేది లేదని తేల్చిచెప్పారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ,రంపాలు తెస్తాం, కుత్తుకలు కోస్తాం వంటి తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వైసీపీ నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. గత పాలకుల్లో ఇంకా రౌడీయిజం, గుండాయిజం చేయాలన్న ఆలోచనలు కనిపిస్తున్నాయని, సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తే మాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోం
మార్కాపురంలో శుక్రవారం రూ.1,290 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న రక్షిత తాగునీటి పథకానికి (drinking water scheme) ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “ప్రస్తుతం 11 సీట్లు గెలిచిన మీకు మేం గౌరవం ఇస్తున్నాం. మా పాలనలో ఏమైనా తప్పులుంటే చెప్పండి, సరిచేసుకుంటాం. అంతేగానీ, బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం” అని అన్నారు.గతంలో వైసీపీకి 151 సీట్లు వచ్చి, తాను రెండు చోట్లా ఓడిపోయినప్పుడే ధైర్యంగా నిలబడి పోరాడామని పవన్ గుర్తుచేశారు. “అలాంటి మమ్మల్ని ఎదుర్కోవడానికి ఎంత దమ్ము కావాలో ఆలోచించండి. ఇప్పుడు 2029లో మా అంతు చూస్తామంటున్నారు. అసలు అప్పటికి మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం” అంటూ సవాల్ విసిరారు. తనకు వైసీపీ (YCP) లో ఏ ఒక్కరిపైనా వ్యక్తిగత కక్షలు లేవని, కానీ ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Pawan Kalyan: ఫ్లోరైడ్ భయంతో కనిగిరిలో ఉండలేకపోయిన మా కుటుంబం: పవన్