భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కి మరో అంతర్జాతీయ అరుదైన గౌరవం లభించగా, ఇది ఆయన గ్లోబల్ లీడర్‌గా ఉన్న స్థాయికి మరో ముద్ర వేస్తోంది. కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో (Trinidad and Tobago) వారు తమ అత్యున్నత పౌర పురస్కారం అయిన “ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో” ను ప్రధానమంత్రి మోదీకి ప్రదానం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ప్రపంచ నాయకుడిగా మోదీ గుర్తింపు
ఈ పురస్కారం దేశ పౌరులకు మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో మానవతా సేవలు అందించిన వ్యక్తులకు లభించేది. ప్రధాని మోదీ (Narendra Modi) కి ఈ గౌరవం లభించడం ద్వారా ఆయన దార్శనిక నాయకత్వానికి, మానవతా విలువలకు, అంతర్జాతీయ సానుభూతికి అద్దం పడుతోంది.
ప్రశంసల వర్షం కురిపించిన ట్రినిడాడ్ ప్రధాని
ట్రినిడాడ్ ప్రధాని కమలా ప్రసాద్ బిస్సేస్సర్ (PM Kamala Prasad Bissessar) మాట్లాడుతూ, ప్రపంచ నాయకుడిగా మోదీ అందిస్తున్న సేవలు, ప్రవాస భారతీయులతో ఆయనకున్న బలమైన అనుబంధం, ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ఆయన చూపిన మానవతా దృక్పథానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు కమలా ప్రసాద్ తెలిపారు. “మోదీ పర్యటన మాకు గర్వకారణం. ప్రపంచం గౌరవించే దార్శనిక నేతకు స్వాగతం పలకడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను” అని ఆమె అన్నారు.
మోదీ ఒక పరివర్తనా శక్తి అని, ఆయన దార్శనిక విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించి, ప్రపంచపటంలో దేశాన్ని ఒక శక్తివంతమైన స్థానంలో నిలబెట్టారని కమలా ప్రసాద్ ప్రశంసించారు. కరోనా సంక్షోభ సమయంలో వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం ద్వారా తమ దేశంతో సహా చిన్న దేశాలకు కూడా వ్యాక్సిన్లు అందించి ఆదుకున్నారని గుర్తుచేశారు. “ఇది దౌత్యం కాదు, ఇది మానవత్వం, ప్రేమతో కూడిన బంధం” అని ఆమె అభివర్ణించారు.
సాంస్కృతిక రాయబారిగా మొదలు – గ్లోబల్ లీడర్‌గా ఎదుగుదల
కమలా ప్రసాద్ ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. 2002లో మోదీ ఒక సాంస్కృతిక రాయబారిగా తమ దేశానికి వచ్చారని, నేడు 140 కోట్ల మంది ప్రజల అధినేతగా, ప్రపంచం మెచ్చిన నాయకుడిగా తిరిగి రావడం విశేషమని ఆమె పేర్కొన్నారు. ఇటీవలే ప్రధాని మోదీ గయానా, డొమినికా, బార్బడోస్ దేశాల నుంచి కూడా అత్యున్నత పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Read also: Nuclear Deal: అమెరికాకు ఇరాన్ కఠిన షరతు – హామీ లేనిదే చర్చలే లేవు!