ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదిక (Edgbaston Venue) గా జరిగిన రెండో టెస్ట్‌లో గిల్ తన కెరీర్‌లోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ రికార్డులు సృష్టించాడు. 25 ఏళ్ల గిల్ 387 బంతుల్లో 30 బౌండరీలు, 3 సిక్సర్లు సహాయంతో 269 పరుగులు చేసి ఇండియా ఇన్నింగ్స్‌కు స్థిరతను అందించాడు.ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాడు.ఈ ప్రదర్శనకు క్రెడిట్ ఇస్తూ భారత మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri), గిల్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాకుండా జట్టు ఫలితాలు ఎలా ఉన్నా గిల్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలని సూచించారు.అంతేకాకుండా జట్టు ఫలితాలు ఎలా ఉన్నా గిల్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలని సూచించారు.
కెప్టెన్ అవుతాడని ఆశించకూడదని రవిశాస్త్రి
ఆట ముగిసిన తర్వాత రవిశాస్త్రి స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడారు. భారత జట్టుకు ఇది శుభసూచకం అన్న రవిశాస్త్రి, సెలెక్టర్లు అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేయడం సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. , అతడిని మూడు సంవత్సరాల వరకు ఏమీ అనొద్దని చెప్పిన శాస్త్రి, ఓవర్సీస్ ట్రిప్‌ల నుంచి నేర్చుకోనివ్వాలని అన్నారు. గిల్ (Shubhman Gill) తప్పకుండా మెరుగుపడతాడని, మొదటి రోజు నుంచే అతడు ఛాంపియన్ కెప్టెన్ అవుతాడని ఆశించకూడదని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. అతడికి సమయం ఇవ్వాలని కోరిన శాస్త్రి అతడు ఒత్తిడిని తట్టుకుంటాడా లేదా అనేదే ప్రశ్నగా మిగిలిందన్నారు. దానికి రెండు సెంచరీలతో సమాధానం చెప్పాడు అని అన్నారు.అంతేకాదు ఒక రోజున్నర బ్యాటింగ్ చేస్తే, అందులో నాలుగు తప్పుడు షాట్లు కూడా లేవని చెప్పిన రవిశాస్త్రి జట్టు 0-1తో వెనుకబడిన సమయంలో కెప్టెన్‌గా ఒత్తిడిని తట్టుకున్నాడని ప్రశంసలు కురిపించారు.

అత్యధిక స్కోరు
మొదటి టెస్టు మ్యాచ్‌లో చేసిన తప్పు నుంచి ఏమి నేర్చుకున్నాడో అది తనకు నచ్చిందన్నారు. నిలకడగా ఆడుతున్న సమయంలో అవుటైన విధానంతో, ఆ తర్వాత టాప్ ఆర్డర్ కుప్పకూలిందని రవిశాస్త్రి పేర్కొన్నారు. కాబట్టి, ఈ రోజు ఉదయం బ్యాటింగ్ (Batting) చేయడానికి వస్తున్నప్పుడు అది అతని మనస్సులో మెదిలి ఉండవచ్చు. నిన్న 114 వద్ద నాటౌట్‌గా ఉన్నాడు. ఈరోజు మాత్రం కచ్చితంగా భారీ స్కోరు చేయాలని అనుకున్నాడు. చేసి చూపించాడు” అని ఈ మాజీ భారత కోచ్ అభిప్రాయపడ్డారు. గిల్ 269 పరుగులతో టెస్టుల్లో అత్యధిక స్కోరు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. కెప్టెన్లలో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియా కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.
read hindi news: hindi.vaartha.com
Read Also: Pakistan Hockey : పాకిస్థాన్ హాకీ జట్లకు గ్రీన్‌సిగ్నల్