రిజర్వ్ ఫారెస్ట్ స్థలాలకు బదులు రెవెన్యూ భూములు
హైదరాబాద్: హెచ్ఎండీఏ (HMDA) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ల (Elevated corridors) పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయని, రక్షణశాఖకు సంబంధించిన భూములను హెచ్ఎండీఏకు బదలాయించడానికి ఒప్పందం చేసుకోవడం కీలక పరిణామమని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. అమీర్ పేట్ లోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

435 ఎకరాల హెచ్ఎండిఎ భూములు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణంలో రక్షణశాఖకు చెందిన 142 ఎకరాల సేకరించడంతో తిరిగి రక్షణశాఖకు జవహార్ నగర్ లోని 435 ఎకరాల హెచ్ఎండీఏ (HMDA) భూములను ఇవ్వనున్నట్టు తెలిపారు. రావిర్యాల రతన్ టాటా ఇంటర్ ఛేంజ్ నుంచి ఆమన్ గల్ వరకు నిర్వహించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల (Greenfield radial roads) నిర్మాణ పనులకు టెండర్లు పూర్తయ్యాయని, కోర్టు కేసుల కారణంగా పనులు ప్రారంభించలేదన్నారు. ఈ ప్రాజెక్టులో 231 రిజర్వ్ ఫారెస్టు భూములను సేకరించామని, వీటికి బదులుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలోని రెవెన్యూ భూములు ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు. కొత్తగా మూడు ప్రాంతాలైన కంది, ఫనల్వాడీ, పెద్ద కంజర్లలో హెచ్ఎండిఏ లేఅవుట్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే ప్రతాపసింగారం, బాచుపల్లి, ఇనుముల్ నర్వ,లేమూరు ప్రాంతాల్లో లే అవుట్లను అభివృద్ధి చేశామని తెలిపారు. రైతులతో చర్చించి భూములు తీసుకుంటున్నామని తెలిపారు. దీంతో పాటు హెచ్ఎండిఏ పరిధిలోని ప్రభుత్వ, అసైన్ భూములను సేకరించి పెద్ద పెద్ద లేఅవుట్లు చేయాలని భావిస్తున్నామని చెప్పారు. హెచ్ఎండిఏక చెందిన భూములు, లేఅవుట్లలో 10శాతం మార్ట్ గేజ్ స్థలాలు కబ్జాకు గురువుతున్నాయని, వాటిని పరిరక్షించడంతో పాటు రెంట్, లీజ్ వంటి విధానంలో ఆదాయాన్ని రాబట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
నగరలంలో స్కైవాక్స్ ఏర్పాటు
నగరలంలో నాలుగు స్కైవాక్స్ (Skywalks) ఏర్పాటు చేయడానికి హెచ్ఎండిఏ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వైస్టేషన్, మెట్రో రైలు ప్రాజెక్టు ఈస్ట్, వెస్ట్ స్టేషన్లతో పాటు రేతిఫైల్, సికింద్రబాద్, కీస్ హైస్కూల్ బస్టాప్ లను కలిపేవిధంగా స్కైవాక్ రూపొందించామని చెప్పారు. కూకట్పల్లి జెఎన్టీయు నుంచి మెట్రో స్టేషన్ వరకు, జెఎన్టియు నుంచి ప్రగతి నగర్ మార్గంలో వెళ్లేందుకు పాదచారుల కోసం స్కైవాక్స్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఉప్పల్ వెళ్లే మార్గం(ఎడమ)లో శ్మశానవాటిక ఉండటంతో స్కైవాక్ ఏర్పాటు చేయలేకపోయాయని, దీంతో ప్రమాదాలు జరుగుతుండటంతో అక్కడ కూడా స్కైవాక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మెహిదీపట్నం స్కైవాక్‌ను ఆగస్టు 15న ప్రారంభించ నున్నట్లు తెలిపారు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్-2050 పనులు 2026 ఏప్రిల్, మే మాసాల్లో పూర్తి కానుందని కమిషనర్ తెలిపారు. మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, ఎకానమిక్ డవలప్మెంట్ ప్లాన్, బ్లూ,గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు.
Read also: Hyderabad: అంతర్జాతీయ స్థాయిలో ఫ్యూచర్ సీటీ అభివృద్ధి – సీఎం రేవంత్ రెడ్డి
Read hindi also: hindi.vaartha.com