అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్పించిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ (One Big Beautiful Bill) ఇటీవలే అమెరికా లో ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రధానంగా పన్ను తగ్గింపులు, ఖర్చుల పెంపు వంటి అంశాలపై దృష్టి సారించింది. అయితే, ఇది అమలులోకి వస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారీ భారం పడే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) హెచ్చరించింది.
$4 ట్రిలియన్ల భారం – IMF ప్రతినిధి హెచ్చరిక
ఈ బిల్లుతో అమెరికాకు రాబోయే 10 ఏళ్లలో దాదాపు $4 ట్రిలియన్ల అదనపు ఆర్థిక భారం ఏర్పడవచ్చని IMF అధికార ప్రతినిధి జూలీ కొజాక్ పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికా ప్రభుత్వ అప్పులు దేశ స్థూల జాతీయోత్పత్తిలో (GDP) 98% వరకు చేరుకున్నాయని ఆమె గుర్తు చేశారు. ఖర్చుల పెంపు, పన్ను తగ్గింపుల సమీకరణం ప్రభుత్వానికి రెవెన్యూ లోటును కలిగించి ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుందని ఆమె అన్నారు.
ఆర్థిక పరిపాలనలో జాగ్రత్తలు అవసరం
IMF సూచనల ప్రకారం.. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆర్థిక పరిపాలనలో బలమైన వ్యూహాత్మకత ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. గణనీయమైన అప్పులు దేశ ఆర్థిక రేటింగ్‌పై ప్రభావం చూపే ప్రమాదం ఉందని, దీని ప్రభావం ప్రపంచ మార్కెట్లపైనా ఉండొచ్చని హెచ్చరిస్తోంది. ట్రంప్ బిల్లు సమర్థవంతంగా అమలవుతుందా లేదా అనేది ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ప్రశ్నగా మారింది.
Read Also : Kim Jong Un : Quad స్టేట్మెంట్ పై కిమ్ ఫైర్