ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government) తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు వెనక్కి వెళ్లింది. పాత వాహనాలకు ఇంధనం ఇవ్వకూడదన్న కొత్త నిబంధనపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. దీంతో ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఈ ఆదేశాలు జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ప్రారంభ దశలోనే ప్రజల నుంచి భారీ వ్యతిరేకత చెలరేగింది. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి పాలసీలో సవరణలు చేసింది.పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా (Manjinder Singh Sirsa) మీడియాతో మాట్లాడారు. పాత వాహనాలను గుర్తించడంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని చెప్పారు. పెట్రోల్ బంకుల వద్ద ఏర్పాటు చేసిన ఏఎన్పీఆర్ కెమెరాలు సరిగ్గా పనిచేయడం లేదని తెలిపారు. కొత్త హై సెక్యూరిటీ ప్లేట్లను గుర్తించలేకపోతున్నాయన్నది ఆయన వివరాలు.

ఎండ్ ఆఫ్ లైఫ్ వాహనాలకు తుక్కు మార్గం
ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు కాలం చెల్లినవిగా పరిగణించబడతాయి. వీటికి ఇకపై ఇంధనం ఇవ్వకుండా తుక్కుకు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది ఢిల్లీలో 62 లక్షల వాహనాలపై ప్రభావం చూపేలా ఉంది.
సోషల్ మీడియాలో కార్ యజమానుల ఆగ్రహం
పలువురు యజమానులు తమ వాహనాలు ఇంకా మంచి పరిస్థితిలో ఉన్నా కూడా తుక్కు అయ్యే పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక యజమాని మా 16 ఏళ్ల మెర్సిడెస్ ఇప్పటికీ కొత్త కార్ల కంటే మెరుగ్గా ఉంది. అయినా తుక్కు? అంటూ వ్యాఖ్యానించారు. మరొకరు తమ ఎనిమిదేళ్ల రేంజ్ రోవర్ కారును అమ్మాల్సి వచ్చిందని వాపోయారు.
ఇది పర్యావరణం కోసం కాదు, వాణిజ్యం కోసం అనిపిస్తోందంటూ విమర్శలు
ఈ నిబంధనల వెనుక పర్యావరణ పరిరక్షణ కన్నా కొత్త వాహనాల కొనుగోలు పెంచే ఉద్దేశమే ఉందంటూ పలువురు అభిప్రాయపడ్డారు. దీనిపై వచ్చిన ప్రజా ఆగ్రహంతో ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది.
Read Also : Narendra Modi : భారత్లో 2,500 పార్టీలు ఉన్నాయి : మోదీ