దేశ రాజధానిలో మానవత్వం కలిచివేసే ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ (Delhi) లోని లజ్‌పత్ నగర్ పార్ట్-1 ప్రాంతంలో ఓ తల్లి, కుమారుడు (Mother and son) తమ నివాసంలోనే దారుణంగా హత్యకు గురయ్యారు. మృతులను రుచికా సేవాని (వయసు 42), ఆమె కుమారుడు క్రిష్ సేవాని (వయసు 14)గా పోలీసులు గుర్తించారు. ఈ దారుణ ఘటన జూలై 2న (బుధవారం) రాత్రి వెలుగులోకి వచ్చింది.

ఫోన్ కాల్స్‌కు స్పందన లేకపోవడంతో భర్త అనుమానం
రుచికా భర్త కుల్దీప్ సేవాని తన భార్యకు, కొడుక్కి పలుమార్లు ఫోన్ చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అనుమానంతో రాత్రి ఇంటికి చేరుకున్న ఆయనకు అపార్ట్‌మెంట్ మెట్లపైన, ప్రవేశ ద్వారం వద్ద రక్తపు మరకలు కనిపించాయి. దీంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురై, వెంటనే రాత్రి 9:43 గంటల సమయంలో పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు.
దారుణ దృశ్యాల మధ్య పోలీసులు
పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని తలుపులు బద్దలుకొట్టి (Breaking down doors) లోపలికి ప్రవేశించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా అక్కడ కనిపించిన దృశ్యం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. బెడ్‌రూమ్‌లో రుచికా సేవాని మృతదేహం (Ruchika Sewani’s body found in bedroom) పడి ఉండగా, వాష్‌రూమ్‌లో ఆమె కుమారుడు క్రిష్ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. ఇద్దరి శరీరాలపై లోతైన కత్తిపోట్లు ఉన్నాయని, అత్యంత దారుణంగా వారిని హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read also: Sexual Harassment: మైనర్ విద్యార్థిపై లైంగిక వేధింపుల కేసులో టీచర్ అరెస్ట్