ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. దేశం మొత్తం మీద వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటుండగా, దాని ప్రభావం రాష్ట్రంపైనా పడనుందని తెలిపింది. జార్ఖండ్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడినప్పటికీ, ద్రోణి ప్రభావం మాత్రం కొనసాగుతోందని స్పష్టం చేసింది. ద్రోణి రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాకా విస్తరించి ఉంది.ఈ ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో ఏపీ (Andhra Pradesh) లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ‘ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
విపత్తుల నిర్వహణ
మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.బుధవారం రాత్రి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు జిల్లా (Kurnool districts) ల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో సముద్రం అలజడిగా మారిందని, మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు ఈ ద్రోణి ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి బుధవారం రాత్రి వరకు ఏపీలో పలు జిల్లాల్లో వానలు పడ్డాయి.

తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు
అత్యధికంగా ఏలూరు జిల్లా వేలేరుపాడులో 10 సెంటీమీటర్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో 9 సెంటీమీటర్లు, ఏలూరు జిల్లా కుకునూరులో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం విజయనగరం, అనకాపల్లి (Anakapalli), అల్లూరి సీతారామరాజు, కర్నూలు, వైఎస్సార్ కడప, నంద్యాల తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.ఇది బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యధిక వర్షపాతం. ఈ వర్షాలు సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉందంటోంది ప్రభుత్వం.
Read Also: Sadaram Slot Bookings : నేటి నుంచి ఏపీలో సదరం స్లాట్ బుకింగ్స్