ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నటి పాకీజా (Pakeezah) ఇటీవల ఓ వీడియోలో తన పరిస్థితిని వివరించారు. ఆమె చెప్పిన ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వీడియోను చూసిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చలించిపోయారు. మానవతా దృక్పథంతో స్పందించిన ఆయన తక్షణమే పాకీజాకు ఆర్థిక సాయం ప్రకటించారు.
రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించిన పవన్
పాకీజా పరిస్థితిని గమనించిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆమెకు రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని ప్రభుత్వ విప్ హరిప్రసాద్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆమెకు చెక్కు రూపంలో అందజేశారు. జనసేన తరఫున ఈ సాయం అందించడం ద్వారా పార్టీ పేదల పట్ల ఉన్న బాధ్యతను చాటిచెప్పింది.
పవన్ కళ్యాణ్‌కు పాకీజా కృతజ్ఞతలు
ఈ సహాయానికి పాకీజా హృదయపూర్వకంగా స్పందించారు. తన బాధను వినిపించి, వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. “చిన్నవాడైనా ఎదురుగా ఉంటే ఆయన కాళ్లు మొక్కుతాను” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు సహాయం చేసిన పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో స్పందన రేపుతున్నాయి.
Read Also : Fire Accident: శివకాశిలో భారీ పేలుడు 5 గురు సజీవ దహనం