3వ తేదీ వరకు అవకాశం.. కాలేజీల్లో 5 లోపు చేరాలి
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం లో ప్రవేశాల నిర్వహించిన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(Dost) సెల్స్ రిపోర్తింగ్ గడువును పొడిగించారు. అలాగే కాలేజీల్లో చేరడానికి సైతం గడువును ఈ నెల 5 వరకు పెంచారు. దోస్త్ ద్వారా ఇప్పటి వరకు మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి గడువు సోమవారంతో ముగియగా దానిని కాస్త ఈ నెల 3 వరకు పొడిగించారు. సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చిన వారు. కాలేజీల్లో చేరడానికి నేటి వరకు ఉన్న గడువును కాస్త ఈ నెల 5 వరకు పొడిగిస్తున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, దోస్త్-2025 కన్వీనర్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మూడో విడత గడువు పొడగింపు
ఇప్పటి వరకు మూడు విడతలుగా డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం నిర్వహించిన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్)- 2025 ఆడ్మిషన్ల ప్రక్రియ నేటితో ముగియనుండగా గడువును పొడిగించారు. మొదటి విడతలో 65వేల మందికి సీట్ల కేటాయింపు చేపట్టగా వారిలో సుమారు 43 వేల మంది కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చారు. ఇక రెండో విడతలో 43వేల సీట్ల కేటాయింపు చేయగా మూడో విడతలో 85,680 మంది విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేశారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 30 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని నేటి వరకు కాలేజీల్లో చేరాలని ఉత్తర్వులు జారీ చేశారు. దోస్త్ మూడో విడత సీట్ల కేటాయింపును శనివారం విడుదల చేశారు. దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్లో భాగంగా 82,770 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మూడో విడతలో 96,015 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారిలో 85,680 మందికి సీట్ల కేటాయింపు చేపట్టారు. తక్కువ ఆప్షన్లు ఇచ్చిన కారణంగా 10,335 మందికి మొదటి విడతలో సీట్ల కేటాయింపు చేయలేదు.
మొదటి ప్రాధాన్యత ఇచ్చిన వారిలో 64,181 మందికి ద్వితీయ ప్రాధాన్యత ఇచ్చిన వారిలో 21,499 మందికి సీట్ల కేటాయింపు చేసినట్టు బాలకిష్టారెడ్డి తెలిపారు. మూడో విడత సీట్ల కేటాయింపులో కామర్స్ విద్యార్థులు 35,402 మందికి కేటాయించారు. లైఫ్ సైన్సెస్ 16,099 మందికి, ఫిజికల్ సైన్స్ లో 20,890 మంది ఉన్నారు. మూడో విడతలో సీటు పొందిన వారు రూ. 500 రూ.1000 ఫీజు చెల్లించి ఈ నెల 30 లోగా సీటు రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మూడు విడతల్లోనూ సీట్లు పొంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వారు ఈ నెల 3లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని.. ఈ నెల 5 వరకు కాలేజీల్లో చేరడానికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Read also: Strike: 9న జరిగే సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు