vijayawada: ప్రపంచంలోనే సాంకేతికరంగంలో అద్భుతాలు ఏపీ (AP) లో రానున్నాయని కేంద్రశాస్త్ర సాంకేతిక శాఖ సహా యమంత్రి జితేంద్ర సింగ్ (Minister Jitendra Singh) అన్నారు. అమ రావతిలో ప్రతిష్టాత్మకమైన క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు నడుంబిగించిన సీఎం చంద్రబాబుకు, ఏపీ (AP) ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ఐబీఏం, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఆంధ్రప్రదేశ్ మధ్య కుదిరినది కేవలం సాంకేతిక సయోధ్య మాత్రమే కాదు. భావి భారత సాంకేతిక సారథ్యానికి వ్యూ హాత్మక పెట్టుబడిగా భావించాలన్నారు. సోమవారం విజయవాడలో జరిగిన క్వాంటం వ్యాలీ నేషనల్ వర్క్ షాప్కు వీడియో కాన్ఫరెన్సు ద్వారా జితేంద్ర సింగ్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని 4 ప్రాంతాల్లో క్వాంటం పరిశోధనా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. 17 రాష్ట్రా ల్లో 152 సంస్థలు ఈ సాంకేతికతపై పనిచేస్తు న్నాయని అన్నారు. ఏఐసీటీఈ ద్వారా బీటెక్ క్వాంటం టెక్నాలజీలో అందిస్తున్నట్లు వివరిం చారు. నేషనల్ క్వాంటం మిషన్ డిజిటల్, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను పర్యవేక్షిస్తోందని చెప్పారు. టెక్నాలజీ ఇండియాను సాధించటంలో క్వాంటం వ్యాలీ కూడా భాగస్వామి అవుతుందని స్పష్టం చేశారు. 9 జాతీయ మిషన్లలో క్వాంటం టెక్నాలజీ విప్లవం ఒకటని అందుకే నేషనల్ క్వాంటం మిషన్ ఏర్పాటు అయిందన్నారు.
Read also: Kakinada: కాకినాడ, అన్నవరం మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే