2024లో వచ్చిన భారీ వర్షాల కారణంగా బుడమేరు వాగు (Budameru) పొంగిపొర్లి విజయవాడలోని పలు ప్రాంతాలను ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ వరదల వల్ల వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పట్లో తాత్కాలికంగా గండ్లు పూడ్చినప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండేందుకు ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టింది.
365 మీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి
పారిశుధ్య శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపిన వివరాల ప్రకారం, బుడమేరుకు పక్కన 365 మీటర్ల పొడవు గల రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసారు. దీని నిర్మాణానికి రూ.23 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆయన తెలిపారు. ఈ వాల్ వలన బుడమేరు ప్రవాహం నియంత్రణలో ఉంటుందని, పక్కనున్న ప్రాంతాలకు ఇకపై వరద భయం ఉండదని మంత్రి స్పష్టం చేశారు.
వెలగలేరు హెడ్ రెగ్యులేటర్‌కు 12 గేట్లు
బుడమేరుతో పాటు ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రూ.1.8 కోట్ల ఖర్చుతో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్‌కు కొత్తగా 12 గేట్లు అమర్చినట్లు నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ఇది కూడా నీటి నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుందని, రైతులకు మరియు పక్కా ప్రాంతాల ప్రజలకు ఉపశమనం కలిగించడమే లక్ష్యమని మంత్రి వివరించారు.
Read Also : Sigachi Plant Explosion : భారీ పేలుడుకు కారణమిదేనా?