ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలో (In East Godavari district) పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రజలతో ప్రత్యక్షంగా కలుసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు.ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 10.30 గంటలకు కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద దిగనున్నారు. అక్కడి నుంచి కారులో తాళ్లపూడి మండలం మలకపల్లికి 10.45కి చేరుకుంటారు.మలకపల్లిలో చంద్రబాబు ప్రత్యేకంగా ఓ లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ స్వయంగా అందజేస్తారు. ఆ తరువాత గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పీ-4 పథకం కింద దత్తత తీసుకున్న నిరుపేద కుటుంబాలను కలుసుకుని మట్లాడతారు.
పేదలతో ముఖాముఖి – సంక్షేమంపై చర్చ
పథకాల అమలుపై సమీక్ష, సమస్యలపై చర్చ, వారి అభిప్రాయాలను స్వయంగా వినే ఈ కార్యక్రమం పేదలకు మద్ధతుగా నిలుస్తుందని భావిస్తున్నారు. పీ-4 పథకం కింద వచ్చిన అభ్యర్థులతో కూడా ముఖాముఖి మాట్లాడనున్నారు.అనంతరం కాపవరం గ్రామానికి వెళ్లి టీడీపీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, నియోజకవర్గ అభివృద్ధిపై దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.
చిత్తూరు పర్యటనకు బయలుదేరే ముందు రాజమండ్రి చేరిక
మధ్యాహ్నం 3.30 గంటలకు చంద్రబాబు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 3.40 గంటలకు చిత్తూరు పర్యటన నిమిత్తం బెంగళూరు వైపు హెలికాప్టర్‌లో పయనమవుతారు.ఈ పర్యటనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు స్వయంగా పర్యవేక్షణ చేశారు. స్థానిక అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
Read Also : Hindu woman rape : బంగ్లాదేశ్‌లో మరోసారి హిందూ మహిళపై దారుణం