పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలపై రాష్ట్ర ప్రభుత్వ దృక్పథాన్ని స్పష్టం చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) గట్టిగా స్పందించారు. ఇటీవలి కాలంలో కోల్కతా (Kolkata) లో చోటుచేసుకున్న ఓ అత్యాచార ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆమె, “మహిళలపై నేరాలను మా ప్రభుత్వం ఏమాత్రం సహించదు. నిందితులను మేము కాపాడం,” అంటూ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

కోల్ కతా సామూహిక అత్యాచారం కేసు – 12 గంటల్లో అరెస్టులు
జూన్ 25న కోల్కతాలోని ప్రముఖ విద్యాసంస్థ “సౌత్ కలకత్తా లా కాలేజీ”లో ఓ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి కారణమైంది. బాధిత యువతి ఆరోపణలపై పోలీసులు సత్వరంగా స్పందించి, 12 గంటల వ్యవధిలోనే నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు అయినవారిలో మనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖోపాధ్యాయ్ లాంటి యువకులు ఉన్నారు. కోర్టు వారికి జులై 1 వరకు పోలీస్ కస్టడీ విధించింది.
పార్టీకి చెందిన వారే నిందితులా? మహువా పరోక్ష హెచ్చరిక
నిందితులు తమ పార్టీకి చెందిన వారేనని ప్రచారం జరుగుతుండడంతో ‘నిందితులను కాపాడాలని ప్రయత్నిస్తే ఊరుకోబోం’ అంటూ తమ పార్టీ నేతలను ఆమె పరోక్షంగా హెచ్చరించారు. “మహిళలపై నేరాలను మా ప్రభుత్వం ఏమాత్రం సహించదు. నిందితులను మేం కాపాడం. రేపిస్టులను ప్రోత్సహించే సంస్కృతి బీజేపీదే” అని మొయిత్రా మండిపడ్డారు. మొయిత్రా వ్యాఖ్యలు ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
Read also: Karnataka: వివాహేతర సంబంధం.. భర్తను అత్యంత కిరాతకంగా చంపిన భార్య
Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో విషాదం..తొక్కిసలాటలో ముగ్గురి మృతి