ఇరాన్ నుంచి ఇజ్రాయెల్‌పై (From Iran to Israel) జరిగిన దాడులను అడ్డుకోవడంలో అమెరికా (America) కీలక పాత్ర పోషించింది. ఇజ్రాయెల్‌ను కాపాడేందుకు అమెరికా తక్షణమే మద్దతుగా నిలిచింది. ఈ క్రమంలో అత్యాధునిక ఆయుధాలను భారీగా వినియోగించిందని తాజా నివేదికల్లో పేర్కొన్నారు.మిలటరీ వాచ్ మ్యాగజీన్ తెలిపిన ప్రకారం, ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు అమెరికా THAAD (Terminal High Altitude Area Defense) వ్యవస్థను బరిలోకి దించింది. అత్యాధునిక ఈ క్షిపణి నిరోధక వ్యవస్థ ద్వారా అమెరికా 60 నుంచి 80 ఇంటర్ సెప్టర్లు ప్రయోగించినట్లు అంచనా.
ఒక్కో క్షిపణి ఖర్చు కోటి డాలర్లకు పైగా
THAAD ఇంటర్ సెప్టర్ తయారీ ఖర్చు రూ.100 కోట్లకు పైగా ఉంటుంది. ఒక్కోటి తయారీలో 12 నుంచి 15 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందట. అంటే ఈ 11 రోజుల కాలంలో అమెరికా దాదాపు 800 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు అంచనా వేస్తున్నారు.గత ఏడాది నుంచే ఇజ్రాయెల్ పరిధిలో THAAD వ్యవస్థను మోహరించామని పెంటగాన్ ప్రకటించింది. అయితే ఇటీవలి దాడుల నేపథ్యంలో ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే కారణంగా పెద్ద ఎత్తున THAAD క్షిపణులు వినియోగించబడ్డాయి.
తయారీకి మళ్లీ నెలలు పడే అవకాశం
ప్రస్తుతం అమెరికా ఏటా సగటున 50 నుంచి 60 THAAD ఇంటర్ సెప్టర్లు మాత్రమే తయారు చేస్తోంది. కానీ తాజా ఉద్రిక్తతల్లోనే వాటిలో ఎక్కువ భాగం వినియోగించబడింది. దీంతో భవిష్యత్తులో మళ్లీ వీటిని భర్తీ చేయాలంటే తక్కువ సమయంలో సాధ్యం కాదన్నది అంచనా.అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ పెద్ద ముప్పును తప్పించుకుంది. అయితే, ఈ చర్యలు అమెరికా రక్షణ బడ్జెట్‌పై భారీ ప్రభావం చూపనున్నాయి. ప్రపంచ రాజకీయాల్లో దీనివల్ల ఏర్పడే మార్పులు, భవిష్యత్తులో ఉగ్రవాదం ఎదుర్కొనే తీరుపైనా ప్రభావం పడే అవకాశముంది.
Read Also : Shubhanshu Shukla: అంతరిక్షంలోకి భారతీయ రుచులు.. శుభాంశు శుక్లా తీసుకెళ్లిన వంటకాలు ఇవే!