ఈ మధ్య రోజుల్లో బంగారం కొనుగోలు చేయాలా వద్దా అనే సందేహంలో ఉన్నవారికి తాజా పరిణామాలు శుభవార్తను అందించాయి. జూన్ 14న ఆల్‌టైమ్(All Time) గరిష్ఠానికి తాకిన తర్వాత బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారట్ల బంగారం ధరలు 100 గ్రాములకు రూ.43,700 తగ్గాయి. అప్పట్లో రూ.10,16,800 ఉన్న 100 గ్రాముల ధర, ఇప్పుడు రూ.9,89,500కి పడిపోయింది. ఇక జూన్ 23 నుంచి 25 మధ్యలోనే బంగారం ధరలు 100 గ్రాములకు రూ.18,000, 10 గ్రాములకు రూ.1,800 వరకు పడిపోయాయి. జూన్ 26న ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్(Iran-Israel) మధ్య కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన ప్రకటన చేయడంతో బంగారం ధరలు ఆకాశం నుంచి భూమి మీద కు దిగి వచ్చాయి. ఇక పెట్టుబడిదారులు ఇజ్రాయెల్-ఇరాన్ వార్ వదిలేసి యూఎస్ డాలర్(US Dollar) మీద ఫోకస్ పెట్టడంతో బంగారంపై డిమాండ్ తగ్గింది. ఇదే పరిస్థితులు కొనసాగితే రానున్న కాలంలో ఈ ధరలు మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

డాలర్ ఇండెక్స్ బలహీనత బంగారం తగ్గుదలకు కారణమవుతుండగా, ఫెడ్ రేటు తగ్గింపుపై ఎలాంటి క్లారిటీ లేకపోవడం పసిడి మార్కెట్‌ను అంచనాలో ఉంచింది. అయితే రూపాయి బల పడటం వల్ల దేశీయ బంగారం ధరలు ఎక్కువగా పెరగకపోవడం కారణంగా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ట్రంప్ తీరుతో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇదే సమయంలో ఫెడ్ నుంచి రేటు తగ్గింపు ఎప్పుడు వస్తుందన్నది కీలకంగా మారింది.
అమెరికా ద్రవ్యోల్బణ
ఇప్పుడు పెట్టుబడిదారుల చూపు..US Core PCE డేటా పైనే ఉంది. ఇది అమెరికా ద్రవ్యోల్బణ స్థాయిని సూచించే కీలక గణాంకం. దీనిపై ఆధారపడి ఫెడ్ రేటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది బంగారం ధరలపై కీలక ప్రభావం అయితే చూపనుంది. ఎంసీఎక్స్ లో రూ. 95,500 – రూ. 98,500 మధ్య బంగారం ట్రేడింగ్ జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.బంగారం కొనుగోలు చేసేవారికి ఇది ఓ సదవకాశం. గరిష్ట స్థాయి నుండి ధరలు తక్కువగా ఉండటంతో ప్రస్తుతం కొంతమంది దీన్ని పెట్టుబడి అవకాశంగా కూడా భావిస్తున్నారు.
ప్రస్తుతం బంగారం ధరలు
24 క్యారట్ల బంగారం 1 గ్రాము: రూ.9,895 8 గ్రాములు: రూ.79,160 10 గ్రాములు: రూ.98,950 100 గ్రాములు: రూ.9,89,500 22 క్యారట్ల బంగారం 1 గ్రాము: రూ.9,070 8 గ్రాములు: రూ.72,560 10 గ్రాములు: రూ.90,700 100 గ్రాములు: రూ.9,07,000 18 క్యారట్ల బంగారం 1 గ్రాము: రూ.7,421 8 గ్రాములు: రూ.59,368 10 గ్రాములు: రూ.74,210 100 గ్రాములు: రూ.7,42,100 వెండి ధరలు: 1 కిలో వెండి – రూ.1,08,000 100 గ్రాములు – రూ.10,800 10 గ్రాములు – రూ.1,080 భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్ బలహీనపడటం, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న రాజకీయ పరిస్థితులు, పశ్చిమాసియా దేశాల్లో తగ్గిన ఉద్రిక్తతలు వంటి వాటితో బంగారం ధరలు ఈ సారి తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరొక ముఖ్య కారణం పెట్టుబడిదారులు యూఎస్ డాలర్ మీద పెట్టుబడులకు ఆసక్తి చూపడమేనని చెప్పుకోవచ్చు.
Read Also: Stock Market: మార్కెట్ల లాభాల జోరు..