हिन्दी | Epaper
హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

Viral fevers: విజృంభిస్తున్న వైరల్ జ్వరాలు

Digital
Viral fevers: విజృంభిస్తున్న వైరల్ జ్వరాలు

వాతావరణంలో మార్పులు రావడంతో ఒక్కసారిగా వైరల్ జ్వరాలు(Viral fevers) వ్యాప్తి చెందుతున్నాయి. అంటువ్యాధులైన ఈ జ్వరాలు ప్రతి సీజన్లో వచ్చేవే అయినా, ఈసారి వాటి ప్రభావం కొంత అధికంగా ఉంది. గ్రామాల నుంచి నగరాల వరకు ఉన్న అన్ని ఆసుపత్రుల్లో జ్వరాలతో చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. వర్షాలు కురియడం, వరదలు సంభవించడం, తాగునీరు కలుషితం కావడం వల్ల వైరల్ వ్యాప్తి పెరిగింది.

ముఖ్యంగా దోమకాటు నుంచి వచ్చే డెంగ్యూ, చికున్ గున్యా లాంటి వ్యాధులు విస్తరిస్తున్నాయి. దోమల ఉత్పత్తి జరిగే ప్రాంతాలను గుర్తించి వాటిని అంతమొందించే చర్యలు తీసుకోవాలి. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ అధికారులు వీటిని పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నివారణకు కృషి చేయాలి.

ఇళ్లలో ఉండే పూల కుండీలు, వాడిన కొబ్బరి బోండాలు, వాహనాల టైర్లు, నీరు నిలిచిపోయే మురుగు కాల్వలు, కుంటలు — ఇవన్నీ దోమల ఉత్పత్తికి కేంద్రంగా మారుతున్నాయి. నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఇంటి సమీపంలో మురికినీరు ఉంటే అందులో ఫెనాయిల్ లేదా వాహనాల నుండి వదిలిన ఆయిల్‌ను తడిపి వేయడం వంటివి చేయాలి. ఇంటి లోపల దోమతెరలు, ఆల్అవుట్ వంటి పరికరాలు ఉపయోగించడం ద్వారా దోమల నివారణ సాధ్యపడుతుంది.

వైరల్ జ్వరాలు(Viral fevers) తగ్గే వరకు సాధ్యమైనంతవరకు కాచి చల్లార్చిన నీటినే తాగాలి. సురక్షిత నీటిని మాత్రమే తీసుకోవడం వల్ల వైరస్ నివారించవచ్చు. వేడివేడి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా గుర్తించాల్సింది ఏమిటంటే వైరల్ జ్వరాలకు యాంటీబయోటిక్స్ పనికిరావు. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే సాధారణ మందులతో ఉపశమనం పొందొచ్చు.

వైరల్ జ్వరం(Viral fevers) సాధారణంగా నాలుగు నుంచి ఐదు రోజులపాటు ఉంటుంది. ఇతర రోగాలతో బాధపడేవారు కాకపోతే, వైరల్ వల్ల భయపడాల్సిన అవసరం లేదు. అయితే డెంగ్యూ వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తలు, వైద్య చికిత్స అవసరం. విశ్రాంతి తీసుకుంటూ పౌష్టికాహారం తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు. 55 ఏళ్లకు పైబడినవారిలో వైరల్ సోకితే ఆక్సిజన్ స్థాయిలు తగ్గే ప్రమాదం ఉంటుంది. పండ్ల రసాలు, సూప్లు, పాలు తీసుకోవచ్చు. అయితే అతిసారం ఉన్నవారికి పాలు వద్దు.

కొందరిలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది. వైద్యుల సూచనలతో పాటు తృణధాన్యాలు, బచ్చలి, నారింజ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత మూడు రోజుల పాటు 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. డెంగ్యూ, చికున్ గున్యా వంటి వైరస్ వ్యాధులకు నిపుణుల సలహా అవసరం.

అతిచల్లని పదార్థాలు వైరస్ వ్యాప్తికి కారణమవుతాయి. ఒకరి వస్తువులు, దుస్తులు, తువాళ్లు ఇంకొకరు వాడకుండా ఉండాలి. ఇంట్లో ఎవరికి వైరల్ అయితే, వారికి ప్రత్యేక గదిలో ఉండేలా చూడాలి. జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, వాంతులు, అలసట, కండరాల నొప్పులు, కడుపు నొప్పి, అతిసారం లాంటి లక్షణాలు వైరల్ లో కనిపిస్తాయి.

ఫ్లూ వైరస్ శ్వాసకోశ బిందువుల ద్వారా, డెంగ్యూ, చికున్ గున్యా, జికా, వెస్ట్ నైల్ లాంటివి దోమల ద్వారా వ్యాపిస్తాయి. వీటి పరిణామాలు తీవ్రమైనవి కావొచ్చు. వైద్యులు మొదట లక్షణాల ఆధారంగా మందులు ఇస్తారు. అవి పనిచేయకపోతే టెస్టులు చేస్తారు.

డెంగ్యూ మినహా మిగిలిన వైరల్ జ్వరాలకి ఆసుపత్రిలో చేరే అవసరం పెద్దగా ఉండదు. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారైతే మాత్రం వైద్య పర్యవేక్షణ అవసరం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ తీవ్రత అధికంగా ఉంది. ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి.

అందువల్ల ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా సరైన చికిత్స తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం వ్యాయామం, యోగా, పౌష్టికాహారం తప్పనిసరి.

Read Also: Hydra: హైడ్రా ఫలవంత ప్రయోగం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870