हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Bonalu: తెలంగాణలో బోనాల సందడి షురూ..

Shobha Rani
Bonalu: తెలంగాణలో బోనాల సందడి షురూ..

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో బోనాల పండగకి చాలా ప్రాధాన్యత ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. బోనాలను (Bonalu) రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఇక ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాలు ప్రారంభం అవుతాయి. నెల రోజుల పాటు భాగ్యనగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి.. తమను సల్లంగా చూడమని వేడుకుంటారు.ఇక ఈ ఏడాది బోనాల సంబురం నేటి నుంచే అనగా.. జూన్ 26, గురువారం నాడే మొదలు కాగా.. జులై 24న బోనాలు ముగుస్తాయి. బోనాల పండుగ సందర్బంగా.. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. మరి గోల్కొండ కోటలోనే తొలి బోనం ఎందుకు సమర్పిస్తారు.. ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి మొదలైంది..
బోనాల పండుగకు ప్రత్యేకమైన చారిత్రక ప్రాముఖ్యత
ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే తొలి గురువారం లేదా ఆదివారం నాడు బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. దీనిలో భాగంగానే నేడు గోల్కొండ జగదాంబిక ఆలయం నుంచి బోనాల సంబరాలు మొదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అర్చకులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఆ తర్వాత జులై 13వ తేదీన సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో బోనాలు సమర్పిస్తారు. వీటినే లష్కర్‌ బోనాలు అని కూడా అంటారు.
సికింద్రాబాద్‌లో బోనాలు సమర్పించిన మరుసటి రోజు భవిష్యవాణి తెలిపే రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత జులై 21వ తేదీన పాతబస్తీలోని లాల్‌ దర్వాజ సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. చివరికి గోల్కొండ కోటలో బోనాల సమర్పణతో హైదరాబాద్ నగరంలో బోనాల సంబరాలు ముగుస్తాయి.
గోల్కొండ కోటలోనే తొలి బోనం
హైదరాబాద్ బోనాల ఉత్సవాలకు సుమారు 600 ఏళ్లకు పైగా చరిత్ర ఉందంటున్నారు. సర్వాయి పాపన్న కరీంనగర్‌లో ఎల్లమ్మ గుడిని కట్టించి అమ్మవారికి బోనాలు సమర్పించారనే కథ ప్రచారంలో ఉన్నాయి. అలానే గోల్కొండ కోట కాకతీయుల ఆధీనంలో ఉన్నప్పటి నుంచే ఇక్కడ బోనాలు నిర్వహించేవారని.. ఆ తర్వాత గోల్కొండను జయించిన కుతుబ్‌షాహీలు సైతం ఆ సంప్రదాయాన్ని కొనసాగించారని చరిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
మాదన్న, తానీషా – మతసామరస్య చిహ్నాలు
హైదరాబాద్‌కు సంబంధించిన చారిత్రక ఆధారాల ప్రకారం…. 1675లో కుతుబ్‌షాహీ పాలకుల హయాంలోనే బోనాలు ప్రారంభమయ్యాయని తెలుస్తుంది. కుతుబ్‌షాహీ వంశానికి చెందిన ఏడవ, చివరి చక్రవర్తి అబుల్ హసన్ తానీషా వద్ద మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాదన్న.. గోల్కొండ కోటలో ఎల్లమ్మ కోసం ఆలయాన్ని నిర్మించారు. అదే ప్రస్తుతం మన కొలుస్తున్న జగదాంబిక అమ్మవారి దేవాలయంగా ప్రసిద్ది చెందింది. 600 వందల ఏళ్లకు పైగా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు.
భక్తుల అంకిత భావం
కుతుబ్‌షాహీ పాలకుల్లో అబుల్ హసన్ తానీషాకు ప్రత్యేక చరిత్ర ఉంది. మతసామరస్యం పాటించిన పాలకుడిగా.. హిందువులకు కూడా మంచి పదవులు ఇచ్చిన రాజుగా చరిత్రకారులు ఆయనను పొగిడారు. అందుకు నిదర్శనమే మాదన్నకు మంత్రి పదవి ఇవ్వడమే కాక.. గోల్కొండలో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వడమని చరిత్రకారులు అంటున్నారు. అంతేకాక ఆయన పలు హిందువుల పండుగల్లో స్వయంగా పాల్గొనేవాడని చరిత్ర చెబుతుంది.

Bonalu: తెలంగాణలో బోనాల సందడి షురూ..
Bonalu: తెలంగాణలో బోనాల సందడి షురూ..

బోనాల పండుగ కాలక్రమం
జూన్ 26: గోల్కొండ కోటలో తొలి బోనం సమర్పణ
జులై 13: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో లష్కర్ బోనాలు
జులై 14: రంగం కార్యక్రమం – భవిష్యవాణి
జులై 21: పాతబస్తీలో లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి బోనం
జులై 24: బోనాల పండుగ ముగింపు

Read Also: Telangana RTA: తెలంగాణలో ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మిక

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

ఏపీ ఆలయాలపై ప్రభుత్వ సర్వే నివేదిక

ఏపీ ఆలయాలపై ప్రభుత్వ సర్వే నివేదిక

రేపు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆహారానికి కొరతే ఉండదు!

రేపు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆహారానికి కొరతే ఉండదు!

ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

హిందూ ధర్మానికి శ్రీవారిసేవకులు బ్రాండ్ అంబాసిడర్లు

హిందూ ధర్మానికి శ్రీవారిసేవకులు బ్రాండ్ అంబాసిడర్లు

‘వైకుంఠ’ ద్వార దర్శనాలకు తొలి మూడురోజులకు 1.76లక్షల టోకెన్లు

‘వైకుంఠ’ ద్వార దర్శనాలకు తొలి మూడురోజులకు 1.76లక్షల టోకెన్లు

వేదమూర్తి దేవవ్రత్ ఘనతపై ఫిదా అయిన మోదీ

వేదమూర్తి దేవవ్రత్ ఘనతపై ఫిదా అయిన మోదీ

శబరిమలలో రికార్డు ఆదాయం – 15 రోజుల్లోనే రూ. 92 కోట్లు

శబరిమలలో రికార్డు ఆదాయం – 15 రోజుల్లోనే రూ. 92 కోట్లు

18 పావన మెట్లు: ముక్తికి మార్గసూచిక

18 పావన మెట్లు: ముక్తికి మార్గసూచిక

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

దుర్గమ్మ ఆలయం కనకదుర్గానగర్ టోల్ కాంట్రాక్టర్ కురూ.50వేల జరిమానా

దుర్గమ్మ ఆలయం కనకదుర్గానగర్ టోల్ కాంట్రాక్టర్ కురూ.50వేల జరిమానా

📢 For Advertisement Booking: 98481 12870