భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(India’s T20I captain Suryakumar)కు ఇటీవల స్పోర్ట్స్ హెర్నియా సమస్య (Sports hernia problem) తలెత్తింది. ఈ కారణంగా ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. “నాకు సర్జరీ విజయవంతంగా పూర్తైంది. త్వరలోనే కోలుకుని మళ్లీ మీ ముందుకు వస్తాను” అని పోస్టు చేశారు. ఇటీవల వరుసగా మ్యాచ్‌లు ఆడిన సూర్య, బాడీ పైన తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. ఫిజియో సూచనల మేరకు ఆయన ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బంగ్లాదేశ్ సిరీస్‌కు దూరం
ఈ సర్జరీ కారణంగా సూర్యకుమార్ యాదవ్ కొంతకాలం ఆటకు దూరంగా ఉండనున్నారు. వచ్చే ఆగస్టులో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కి ఆయన అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. బీసీసీఐ డాక్టర్ల సూచన మేరకు ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరం. దీంతో, బంగ్లాదేశ్ పర్యటనకు సూర్య స్థానంలో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయనున్నారు. అందులో భాగంగా, శ్రేయస్ అయ్యర్‌కు టీ20 సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశముందని సమాచారం.
త్వరగా కోలుకుంటానన్న ఆశా వ్యక్తం
సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. అభిమానుల నుంచి తాను పొందుతున్న ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, త్వరలోనే క్రికెట్ మైదానంలో అడుగుపెడతానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల టీ20 వరల్డ్‌కప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన సూర్యకు ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా గుర్తింపు ఉంది. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ జట్టుతో కలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Read Also : Ration Door Delivery: ఏపీలో వారికి నేటి నుంచి ఇంటికే రేషన్