అనంతపురం జిల్లాలో దారుణమైన హత్య సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కంపల్లి గ్రామానికి చెందిన సురేశ్ (37) అనే వ్యక్తిని, అతని భార్య అనిత మరియు ఆమె ప్రియుడు ఫక్రుద్దీన్ కలిసి హత్య (Murder ) చేశారు. సురేశ్ 8 సంవత్సరాల క్రితం అనిత(Anitha)ను వివాహం చేసుకుని జీవితం సాగించేవాడు. గ్రామంలో ఓ చిన్న హోటల్ నడుపుతూ జీవనం గడిపే సురేశ్‌కు, తన భార్యపై ఇటీవల అనుమానం పెరిగింది. కారణం – అనిత, పండ్ల వ్యాపారంతో ఉన్న ఫక్రుద్దీన్‌తో నెలల క్రితమే ఏర్పడిన వివాహేతర సంబంధం.
ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర
భర్త తరచూ అనుమానంతో అనితను మందలించేవాడు. ఈ నేపథ్యంలో అతని నుండి ముక్తి పొందాలని అనుకున్న అనిత, ఫక్రుద్దీన్‌తో కలిసి భయానకంగా హత్య ప్లాన్ చేశారు. నిన్న రాత్రి సురేశ్ హోటల్ మూసి ఇంటికి బయలుదేరిన సమయంలో ఫక్రుద్దీన్ అతనిపై దాడి చేశాడు. ముందుగా సీసాతో తలపై కొట్టి, ఆపై స్క్రూడ్రైవర్‌తో పొడిచి, చివరకు బండరాయితో హత్య చేశాడు. ఇది పూర్తిగా అనిత చెప్పిన ప్రణాళిక ప్రకారమే సాగిందని పోలీసులు గుర్తించారు.
ఆరు గంటల్లో నిందితుల అరెస్ట్ – పోలీసుల తక్షణ స్పందన
ఈ హత్య ఘటన జరిగిన వెంటనే అనంతపురం ఎస్పీ జగదీశ్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కేసును తక్షణమే పరిశీలించారు. సీఐ శేఖర్ నేతృత్వంలో పోలీసులు కేవలం 6 గంటల వ్యవధిలో అనిత, ఫక్రుద్దీన్‌లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పూర్తి వివరాలు రాబట్టి కేసును ఛేదించిన పోలీసులకు ఎస్పీ ప్రశంసలు తెలిపారు. ఈ అమానుష హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భార్య ప్రేమికుడితో కలిసి భర్తను చంపిన విషయం తెలిసి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also :Big Alert : వెంటనే అకౌంట్స్ పాస్ వర్డ్స్ మార్చుకోండి