భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని, ఆ రోజులను ఏ భారతీయుడూ మరిచిపోలేరని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) అన్నారు. ఇందిరా గాంధీ (Indira Gandhi) ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ రోజును దేశ ప్రజలతో పాటు తాము కూడా ‘సంవిధాన్ హత్యా దివస్’గా పరిగణిస్తున్నామని తెలిపారు.
“సంవిధాన హత్యా దినం”గా భావించాలి – మోడీ విమర్శ
ఎమర్జెన్సీ కాలంలో నాటి పాలకులు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను పూర్తిగా పక్కనపెట్టారని ప్రధాని మోడీ (Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ప్రాథమిక హక్కులను కాలరాశారని, పత్రికా స్వేచ్ఛను దారుణంగా అణచివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, చివరికి సామాన్య పౌరులను కూడా అన్యాయంగా జైళ్లలో నిర్బంధించారని ఆరోపించారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్నే అరెస్టు చేసినట్లుగా అనిపించిందని మోడీ వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యం కోసం పోరాడినవారికి సెల్యూట్
ఎమర్జెన్సీ నాటి భయానక పరిస్థితులను ఏ భారతీయుడూ అంత తేలికగా మరచిపోలేరని ప్రధాని పునరుద్ఘాటించారు. ఆ దుర్మార్గమైన పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రతి ఒక్కరికీ తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు మొక్కవోని దీక్ష(Dhiksha)తో పోరాటం చేశారని గుర్తుచేశారు. వారి అలుపెరగని పోరాటం వల్లే చివరికి ఎమర్జెన్సీని ఎత్తివేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
వికసిత భారత్ దిశగా మోడీ
రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను మరింత బలోపేతం చేస్తామని, వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మోడీ (Narendra Modi) తెలిపారు. పేదలు, అణగారిన వర్గాల ప్రజల కలలను సాకారం చేయడమే తమ ధ్యేయమని అన్నారు.

‘ది ఎమర్జెన్సీ డైరీస్’ – మోడీ కొత్త పుస్తకం
ఈ సందర్భంగా, ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ (The Emergency Diaries)పేరుతో తాను ఒక పుస్తకాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రధాని మోడీ (Narendra Modi) వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా తన ప్రస్థానం, ఎమర్జెన్సీ రోజుల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితులు, తన అనుభవాలను ఆ పుస్తకంలో వివరంగా పొందుపరచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పుస్తకం ద్వారా నాటి చీకటి రోజులకు సంబంధించిన అనేక తెలియని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.
పేదల కలలు సాకారం చేయడమే లక్ష్యం
రాజ్యాంగ విలువలను బలోపేతం చేయాలని, వికసిత భారత్ లక్ష్యంతో ముందుకెళ్లాలని మోడీ తెలిపారు.
ఆదివాసీలు, మహిళలు, పేదల అభివృద్ధి తమ పాలనకు మార్గదర్శక మంత్రంగా పేర్కొన్నారు.
Read Also: Emergency 1975: భారతదేశ చరిత్రలో మలినం వేసిన రోజు: 1975