అదనంగా మరో మూడులేన్లు – క్రాస్ఓవర్లు నివారణకు చర్యలు
Tirumala: రోజుకు సరాసరి 10 వేలవరకు యాత్రికుల వాహనాలు.. 6వేలకు పైగా ట్యాక్సీలు, స్థానికుల వాహనాలు, కొండపై వ్యాపారుల వాహనాలు ఇలా 20 వేల వరకు తిరుమలకు చేరుతున్నాయి. ఇవిగాక భక్తులను సులభంగా తిరుమలకు చేరవేసేందుకు 450 వరకు ఆర్టీసి బస్సులు, వెయ్యివరకు ద్విచక్రవాహనాలు రోజువారీగా తిరుమలకు అలిపిరి తనిఖీ కేంద్రం నుండి దాటుకుని రావలసి ఉంది. ఈ వాహనాలను తనిఖీ కేంద్రంలో భద్రత సిబ్బంది నిశితంగా లగేజీలను, వాహనాలను తనిఖీ చేసిన తరువాత తిరుమలకు అనుమతిస్తారు.

వేగంగా పెరుగుతున్న వాహనాల రద్దీ
ప్రస్తుతం సప్తగిరి తనిఖీ కేంద్రంలో 12 లైన్లువరకు వాహనాలను నిర్వహిస్తుండగా ఇందులో మొదటి లైన్ పూర్తిగా అత్యవసర విభాగానికి చెందిన వాహనాల రాకపోకలు, తనిఖీ కేంద్రంలో విధులు నిర్వహించే విజిలెన్స్, ఎస్పిఎఫ్, సెక్యూరిటీ, టిటిడి సెక్యూరిటీ సిబ్బంది సులభంగా వచ్చేందుకు ఉంది. ఆ తరువాత పక్కనే మొదటి లేన్ విఐపిల వాహనాలను అనుమతినిస్తారు. ఆ తరువాత యాత్రికుల వాహనాలకు వరుసగా 8లైన్లు కేటాయించారు. 9,10 లైన్లు ద్విచక్రవాహనాల కోసమే నిర్వహిస్తున్నారు. 11,12 లైన్లలో ఆర్టీసి బస్సులు, టిటిడికి చెందిన లగేజీ వాహనాలు, తిరుమలకు వస్తువులు తరలించే, ఆహారపదార్థాలు తరలించే అనుమతిపొందిన వాహనాలు తనిఖీ చేసి పంపుతారు. యాత్రికుల సంఖ్యతో పాటు వాహనాలు కూడా పెరగడంతో వేకువజామున 3గంటల నుండి అర్ధరాత్రి 12గంటల వరకు నిరంతరాయంగా చేపట్టే తనిఖీలు రద్దీసమయంలో మరింత ఆలస్యమై కిలోమీటర్లు వరకు వాహనాలు మొదటి ఆర్చి వరకు బారులు తీరుతున్నాయి. దీనివల్ల యాత్రికులు దర్శనానికి చేరుకునే సమయం కూడా ఆలస్యమవుతోంది. ఇవిగాక భక్తులను సులభంగా తిరుమలకు చేరవేసేందుకు 450 వరకు ఆర్టీసి బస్సులు, వెయ్యివరకు ద్విచక్రవాహనాలు రోజువారీగా తిరుమలకు అలిపిరి తనిఖీ కేంద్రం నుండి దాటుకుని రావలసి ఉంది.
సప్తగిరి తనిఖీ కేంద్రంలో వాహనాల క్రమబద్ధీకరణ
ఈ వాహనాలను తనిఖీ కేంద్రంలో భద్రత సిబ్బంది నిశితంగా లగేజీలను, వాహనాలను తనిఖీ చేసిన తరువాత తిరుమలకు అనుమతిస్తారు. ప్రస్తుతం సప్తగిరి తనిఖీ కేంద్రంలో 12 లైన్లు వరకు వాహనాలను నిర్వహిస్తుండగా ఇందులో మొదటి లైన్ పూర్తిగా అత్యవసర విభాగానికి చెందిన వాహనాల రాకపోకలు, తనిఖీ కేంద్రంలో విధులు నిర్వహించే విజిలెన్స్, ఎస్పిఎఫ్, సెక్యూరిటీ, టిటిడి సెక్యూరిటీ సిబ్బంది సులభంగా వచ్చేందుకు ఉంది. ఆ తరువాత పక్కనే మొదటి లైన్ విఐపిల వాహనాలను అనుమతినిస్తారు. ఆ తరువాత యాత్రికుల వాహనాలకు వరుసగా 8లైన్లు కేటాయించారు. 9,10 లైన్లు ద్విచక్రవాహనాల కోసమే నిర్వహిస్తున్నారు. 11,12 లైన్లలో ఆర్టీసి బస్సులు, టిటిడికి చెందిన లగేజీ వాహనాలు, తిరుమలకు వస్తువులు తరలించే, ఆహారపదార్థాలు తరలించే అనుమతిపొందిన వాహనాలు తనిఖీ చేసి పంపుతారు. యాత్రికుల సంఖ్యతో బాటు వాహనాలు కూడా పెరగడంతో వేకువజామున 3గంటల నుండి అర్ధరాత్రి 12గంటల వరకు నిరంతరాయంగా చేపట్టే తనిఖీలు రద్దీసమయంలో మరింత ఆలస్యమై కిలోమీటర్లువరకు వాహనాలు మొదటి ఆర్చి వరకు బారులు తీరుతున్నాయి. దీనివల్ల యాత్రికులు దర్శనానికి చేరుకునే సమయం కూడా ఆలస్యమవుతోంది. ఈ విషయాలను టిటిడి ఇఒ శ్యామలరావు, అదనపు ఇఒ వెంకయ్యచౌదరి, సివిఎసీ కెవి మురళీకృష్ణ పరిస్థితిని అధ్యయనం అధ్యయనం చేశారు.