యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా శుక్రవారం అంతరిక్షంలోకి పయనించనున్నారు. ఈ మిషన్‌కు సంబంధించిన స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ లాంచ్ అమెరికాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుండి ఈరోజు మధ్యాహ్నం 12:01 గంటలకు జరగనుందని నాసా ప్రకటించింది. అంతరిక్ష ప్రయోగాల్లో విశేష అనుభవం కలిగిన స్పేస్ఎక్స్ సంస్థ ఈ ప్రయోగానికి నాయకత్వం వహిస్తోంది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 14 రోజుల ప్రయాణం
ఈ మిషన్‌లో శుభాంశు శుక్లాతో పాటు మరికొద్దిమంది అంతరిక్ష యాత్రికులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) కు చేరుకుంటారు. అక్కడ 14 రోజులపాటు వివిధ శాస్త్రీయ ప్రయోగాలు, పరిశోధనలు నిర్వహించనున్నారు. ఇందులో ఆరోగ్య పరిరక్షణ, జీవశాస్త్రం, భౌతికశాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలు ఉంటాయి. ఇది ప్రైవేట్ మిషన్‌గా రూపుదిద్దుకున్న నాలుగో యాక్సియం ప్రాజెక్ట్ కావడం విశేషం.
ఏడుసార్లు వాయిదా పడిన ప్రయోగం
ఈ ప్రయోగం ముందుగా నిర్ణయించిన తేదీల్లో ఏడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. వాతావరణ కారణాలు, సాంకేతిక సమస్యల నేపథ్యంలో ప్రయోగం తరచూ వాయిదా పడుతూ వచ్చింది. చివరికి నేడు ప్రయోగం జరగనున్నట్లు నాసా తుది షెడ్యూల్ విడుదల చేసింది. శుభాంశు శుక్లా మానవసమాజానికి సేవ చేసే ఆవిష్కరణలపై ISS లో జరగబోయే పరిశోధనల్లో పాల్గొనడం గర్వకారణమని భారత అంతరిక్ష ప్రేమికులు భావిస్తున్నారు.
Read Also : Rain Alert : నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు – APSDMA