ఏపీ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూసమీకరణ ప్రక్రియను ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించింది. భవిష్యత్తులో తలెత్తే అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఒకే రకమైన నిబంధనలతో భూసమీకరణ చేపట్టనున్నట్టు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి (Minister Pardasaradi) వెల్లడించారు. అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంపై మంత్రివర్గం దృష్టిసారించింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జలవనరుల పరిరక్షణ, అసైన్డ్ భూములపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే స్థానికులకు ఉచిత వైద్యం, విద్య కల్పనపై కూడా కేబినెట్(AP Cabinet)లో చర్చించారు.
అమరావతి నిర్మాణాలకు కొత్త ఊపు
గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన నిర్మాణాలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే జీఏడీ, హెచ్‌వోడీ టవర్ల నిర్మాణ బాధ్యతలను ప్రముఖ నిర్మాణ సంస్థలకు అప్పగించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ3 రోడ్డును జాతీయ రహదారి 16కు అనుసంధానించే టెండర్లకు రూ.682 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. అంతేకాకుండా, అమరావతిలో హంగులతో కూడిన కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి మంత్రివర్గం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ చర్యలన్నీ రాజధాని అభివృద్ధికి వేగం జోడించనున్నాయి.
ఇతర కీలక నిర్ణయాలు, కేటాయింపులు
ఈ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరిన్ని అన్న క్యాంటీన్లు, భవననిర్మాణ చట్ట సవరణలు, సాకేత్ సాయికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం, గండికోట వద్ద రిసార్టుల కోసం భూ కేటాయింపు, శ్రీశైలం డ్యామ్, కాటన్ బ్యారేజీల రక్షణ పనుల కోసం రూ.350 కోట్లు మంజూరు తదితర అంశాలు కీలకంగా నిలిచాయి. పొగాకు సాగు హక్కులు నిలిపివేసి వచ్చే ఏడాది క్రాప్ హాలిడే ప్రకటించడం, మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలుగా మారుస్తూ తీసుకున్న నిర్ణయాలు గ్రామీణాభివృద్ధికి బలాన్నిస్తాయని అధికారులు తెలిపారు. విశాఖ మధురవాడలో కాగ్నిజెంట్ సంస్థ పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Read Also : Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు