తమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు (PK Sekhar Babu) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పై కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో నిర్వహించిన ‘మురుగన్ మహాభక్త సమ్మేళనం’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హాజరుకావడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “పవన్ కళ్యాణ్ ఎవరు? ఆయనకు తమిళనాడుతో సంబంధం ఏంటి? ఇక్కడ రాజకీయ వ్యాఖ్యలు చేయడమేంటీ?” అంటూ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర రాష్ట్రాల నాయకులు తమిళనాడులోకి ప్రవేశించటం సరైన పని కాదని ఆయన వ్యాఖ్యానించారు.
బీజేపీ ధోరణిపై మండిపాటు
ఈ సందర్భంగా మంత్రి శేఖర్ బాబు బీజేపీపై కూడా విమర్శలు గుప్పించారు. మతం, భాష పేరుతో సమాజాన్ని విభజించడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. తమిళ సంస్కృతిని, సమాజంలోని ఐక్యతను ధ్వంసం చేయాలనే కుట్రతోనే ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమిలో భాగమైన జనసేన పార్టీకి చెందిన నాయకుడిగా వచ్చి ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడడం అసహ్యం అని ఆయన అభిప్రాయపడ్డారు.
పవన్‌కు సవాలు విసిరిన మంత్రి
“పవన్ కళ్యాణ్‌కు ఇక్కడ మాట్లాడే హక్కు కావాలంటే, చెన్నైలో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలి. గెలిచిన తర్వాత ఆయన మాట్లాడితే వింటాం. లేనిపక్షంలో ఆయన వ్యాఖ్యలకు తమిళ్ నాడు ప్రజలు విలువ ఇవ్వరు,” అని స్పష్టం చేశారు మంత్రి శేఖర్ బాబు. రాజకీయ నేతలు ఇతర రాష్ట్రాల్లోని సంప్రదాయాలతో ఆడుకునే ప్రయత్నం చేయకూడదని, ఇది ప్రజల మనోభావాలను గాయపరచే చర్యగా పరిగణించబడుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు దక్షిణాది రాష్ట్రాల మధ్య రాజకీయ సంబంధాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read Also : Jagan Sattenapalli Tour : జగన్ పర్యటన వల్ల మరొకరు మృతి