— మొఖం చాటేసిన వరణుడు.. ఆందోళనలో అన్నదాతలు
టేక్మాల్ (మెదక్): వర్షకాలం (rainy season) ముందు మురిపించి.. వాతవారణం.. భవిష్యత్తుపై మరిన్ని ఆశలు రేకిత్తించింది.. రైతులు ముందస్తు వర్షలు కురువడంతో సాగుకు సిద్దమయ్యారు. భూములను చదును చేసి దుక్కులు దున్ని విత్తులు వేశారు. ముందు మురిపించిన వర్షం..ఆపై మిన్నకుండి పోయింది. దీంతో పంట చేలో మొలకలకు బదులుగా రైతుల గుండెల్లో కరువు రక్కసి కాటేస్తుందన్న భయం పరుగెడుతుంది. పంటల సాగుల కోసం అప్పులు తెచ్చి మొక్కలకు ప్రాణం పోశారు. ఆ మొక్కల ప్రాణం వర్ష చినుకులతో చిగురించాలని ఆశగా వానదేవుడా.. కరుణించరా అంటూ గ్రామాల్లో గ్రామా దేవుళ్ళలకు ప్రత్యేక పూజలు చేస్తూ ఆకాశం వైపు దినంగా చూస్తున్నారు.

వానలు లేక పంటలు ప్రశ్నార్థకంగా
రుతుపవనాలు లేక, వరుణదేవుడు కరుణించక వానాకాలం (ఖరీఫ్) పంటల సాగు ప్రశ్నార్ధకంగా మారుతోంది. రోహిణి కార్తె ప్రారంభంలో 15 రోజుల క్రితం ఒకటి రెండు వర్గాలు రుతు పవనాల ప్రభావంతో పలకరించినప్పటికీ తర్వాత వర్షాలు కురిసిన పరిస్థితి లేకపోవడంతో రైతులు విత్తనాలు వేయలేక పోయారు. నీటి వనరులు, బోరుబావులు, బావుల కింద వరి నార్లు పోసుకున్నప్పటికీ మెట్ట పంటలు వేసేందుకు అనుకూలత లేక పోవడంతో రైతన్నల ఆశలు ఆవిరవుతున్నాయి. రైతులు ఆకాశం వైపు చూస్తూ వరుణదేవా కరుణించవా అంటూ వేడుకుంటున్నారు. పంటల సాగు పరిస్తితి ఏమిటనే ఆవేదన రైతుల్లో కనిపిస్తుండడం గమనార్హం. కోఠి ఆశలతో వ్యవసాయానికి శ్రీకారం చుట్టిన రైతన్నకు అశించిన స్థాయిలో వర్షలు కురువక పోవడంతో ఆందోళన చెందుతున్నాడు. సరైన సమయంలో వర్షాలు పడక పోవడంతో అందోళనను చెందుతున్నారు. బోరుబావులను ఆశ్రహిస్తు వరి పంటను సాగు చేసుకుంటున్నారు. ఆ బోర్లు సైతం భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో లేక గ్యాప్ నీళ్లు వస్తున్నాయి. వర్షాలు రాక పోవడంతో బోర్లలలో నీళ్లు లేక పంటలు ఎండి పోతున్నాయి. దీంతో అన్నదాత కుంగి పోతున్నాడు. వానమ్మ వానమ్మ ఒక్క సారైన వచ్చి పోయో వానమ్మ అంటూ కంట పడిన దేవుళ్ళను మొక్కుతున్నారు. రైతుల మొరను విని వాన దేవుడు కరుణించాలని.. వర్షాలు సమృద్ధిగా కురువాలని ఆశిద్దాం.. అన్నదాతను ఆశీర్వదిద్దాం.
నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని సూచనలు
జిల్లాలో వర్షాలు కురిసి భూమిలో వేడి పూర్తిగా తగ్గిన తర్వాత వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు రైతులు విత్తనాలు నాటుకోవాలని పెద్దశంకరంపేట ఇంచార్జ్ ఏడీఎ రాంప్రసాదావు తెలిపారు. సరైన వర్షాలు లేక జిల్లాలో ఖరీఫ్ సాగు ఇబ్బందికరంగా మారిందన్నారు. నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని, ఖచ్చితంగా రశీదులు పొందాలని సూచించారు. నకిలీ విత్తనాల సమాచారాన్ని స్థానిక వ్యవసాయశాఖ అధికారులకు కాని, స్థానిక పోలీసులకు కాని ఇచ్చి వాటిని అరికట్టేందుకు సహకరించాలన్నారు. సరైన వర్షాలు కురిసి పదునులో విత్తనాలు నాటడం వల్ల అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందని, వ్యవసాయ శాఖ సూచనలు రైతులు పాటించాలని పేర్కొన్నారు.
Read also: Telangana Cabinet Meeting : నేడు క్యాబినెట్ భేటీ.. వీటిపైనే చర్చ!