‘కుబేరా’ సినిమా విజయోత్సవ సభ (Kuberaa Success Meet)లో అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. కార్యక్రమానికి హాజరైన ధనుష్ (Dhanush), మెగాస్టార్ చిరంజీవిని చూసి వెంటనే ఆయన పాదాలకు నమస్కరించారు. కేవలం చిరంజీవి(CHiranjeevi)కే కాదు, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి కాళ్లకూ నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ దృశ్యం అక్కడ ఉన్నవారందరినీ ఆకట్టుకుంది.
చిరంజీవిని ‘ఓం’తో పోల్చిన ధనుష్
ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ.. “మనం ఏదైనా పుస్తకం పై రాసే ముందు పేపర్ మీద ‘ఓం’ రాస్తాం కదా… అలానే ఈ ఈవెంట్కు చిరంజీవి గారు ఓం రూపంలో వచ్చారు” అని ఆయన చక్కగా వ్యాఖ్యానించారు. చిరంజీవి సినిమాలు చూస్తూ తాను పెరిగానని, ఆయన్ని ఎదురుగా చూసి మాట్లాడడం జీవితంలో ఓ గొప్ప క్షణమని చెప్పారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజు అని తెలిపారు.
చిరంజీవి ఆశీర్వాదంతో మరింత ముందుకు
చిరంజీవి ఆశీర్వాదం తీసుకోవడం తనకు గర్వంగా అనిపిస్తోందని, సినిమా విజయంతో పాటు మెగాస్టార్ ఆశీస్సులు కూడా ఈ రోజును ప్రత్యేకంగా మార్చాయని ధనుష్ పేర్కొన్నారు. అభిమానులు, చిత్రబృందం, సెలబ్రిటీలంతా ఈ సంఘటనపై ప్రశంసలు వెల్లువెత్తిస్తున్నారు. ధనుష్ వినమ్రత, తన సినీ సీనియర్లపై చూపిన గౌరవం అందరి మన్ననలు పొందుతోంది.
Read Also : Sathya Sai : 10 రోజులు సత్యసాయి శత జయంతి వేడుకలు