ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan )తమిళనాడులో నిర్వహించిన ‘మురుగన్ మహాభక్త సమ్మేళనం’(Murugan Devotees Meet)లో పాల్గొని, మతపరమైన విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో మతపరమైన అవగాహన పెంచేలా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
“ఇది నకిలీ సెక్యులరిజం”
“ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించుకుంటే అభ్యంతరం లేదు. ముస్లిం వ్యక్తి తన మతాన్ని పాటించడంపై ఎవరూ ప్రశ్నించరు. అయితే హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం ఎందుకు అభ్యంతరం వస్తుంది? ఇదే నకిలీ సెక్యులరిజం,” అంటూ పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. మత స్వేచ్ఛ దేశంలో ప్రతి పౌరునికీ రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆయన అన్నారు.
“నేను హిందువుని –అన్ని మతాలను గౌరవించుకుంటాను”
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “నేను హిందువుగా పుట్టాను. హిందువుగా జీవిస్తున్నా. నా మతాన్ని గౌరవించడమే కాదు, ఇతర మతాల పట్ల కూడా అదే గౌరవం కలిగి ఉన్నాను. మతంపై గౌరవం కలిగివుండటం ఒక్కరికి మాత్రమే కాకుండా అందరికీ ఉండాలి. మతపరమైన ఐక్యత, పరస్పర గౌరవం ద్వారా సమాజంలో సామరస్యం సాధ్యమవుతుంది” అని పేర్కొన్నారు.
ఈ సందేశం ద్వారా పవన్ కళ్యాణ్ తన మతపరమైన భావాలను స్పష్టంగా చెప్పడమే కాకుండా, దేశంలో ప్రబలుతున్న నకిలీ సెక్యులరిజంపై తన ఆవేదనను వ్యక్తం చేశారు.
Read Also : Andy Jassy : AI వలన ఉద్యోగాలపై ప్రభావం: అమెజాన్ CEO హెచ్చరిక