తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో భావోద్వేగ చిత్రాలను రూపొందించే దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ‘కుబేర’ (Kuberaa) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో భవిష్యత్తులో తాను పని చేయాలనుకునే హీరోల గురించి మాట్లాడారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఒక సినిమా చేసే అవకాశమొస్తే, అది పూర్తిగా రొమాంటిక్ డ్రామాగా ఉంటుందని తెలిపారు.
మహేష్ తో మూవీ
తన సినిమాలకు ప్రత్యేకత అయిన భావోద్వేగాలు, సహజమైన ప్రేమ కథలు మహేశ్ బాబుతో ఎంతో బాగా సరిపోతాయని శేఖర్ అభిప్రాయపడ్డారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో అయితే రెబల్ అటిట్యూడ్ ఉన్న పవర్‌ఫుల్ మూవీ తీస్తానని చెప్పారు. అడివి శేష్, సిద్ధూ జొన్నలగడ్డ లాంటి యాక్టర్స్‌తో మాత్రం ఇంటెన్స్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ మూవీస్ చేయాలనుందన్నారు. అలాగే విజయ్ దేవరకొండతో ఓ మధురమైన ప్రేమకథ తీస్తే బాగుంటుందన్న ఆలోచన వ్యక్తం చేశారు.
శ్రీలీల తో చేస్తే అలాంటి సినిమానే
హీరోయిన్ల విషయానికి వస్తే.. శ్రీలీలతో ఎనర్జిటిక్ డాన్స్ బేస్డ్ మూవీ తెరకెక్కించాలన్న కోరిక ఉందని చెప్పారు. అలాగే నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేశ్‌తో ఓ ఉమెన్ సెంట్రిక్ స్టోరీ చేసే ఆలోచన ఉందని వెల్లడించారు. శేఖర్ కమ్ముల వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకులు, అభిమానులు ఆయన భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also : Kerala : కేరళ కొట్టియూర్ పండుగ మహోత్సవానికి వేలాది మంది భక్తులు