గుజరాత్‌కు చెందిన ప్రముఖ గుజరాతీ ఫిల్మ్ డైరెక్టర్ మహేశ్ జీరావాలా (Mahesh Jirawala), ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం(Air India Plane Crash)లో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు, ప్రమాద స్థలంలో లభించిన బైక్, మొబైల్ ఫోన్ మరియు DNA పరీక్షల ఆధారంగా మహేశ్ మృతిచెందినట్టు అధికారికంగా ధ్రువీకరించారు. ప్రమాదం జరిగినప్పటి నుంచీ ఆయన కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
DNA పరీక్షలతో నిజం వెలుగులోకి
మహేశ్ జీరావాలా ఆ ప్రమాద దుర్ఘటనకు గురయ్యారా అనే అనుమానాలు మొదట్లో ఉండగా, DNA టెస్ట్‌లు స్పష్టతనిచ్చాయి. ప్రమాద స్థలంలో లభించిన మృతదేహాన్ని మహేశ్‌దేనని గుర్తించిన పోలీసులు, దాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫ్లైట్ క్రాష్ రోజు, ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఒక వ్యక్తిని కలవడానికి వెళ్లినట్లు మహేశ్ భార్య హేతల్ పోలీసులకు తెలిపిన విషయాన్ని కూడా వారు ధృవీకరించారు.
గుజరాత్ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు
మహేశ్ జీరావాలా మృతి గుజరాతీ సినిమా పరిశ్రమను విషాదంలో ముంచేసింది. ఆయన ఎన్నో ప్రజాదరణ పొందిన చిత్రాలకు దర్శకత్వం వహించగా, యువ దర్శకులకి ప్రేరణగా నిలిచారు. ఈ అకస్మాత్తుగా జరిగిన విషాదకర ఘటనపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ మృతికి గౌరవంగా సినిమాల షూటింగ్‌లను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.
Read Also : Sitare Zameen Par: భారీ కలెక్షన్లు వసూలు చేసిన ఆమిర్‌ఖాన్ ‘సితారే జమీన్ పర్’